సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు


Sun,February 10, 2013 11:48 PM

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి కార్మికులు నాటి నుంచి నేటివరకు నిత్య దారివూదాన్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా 1993 నుంచి చిన్న, చిన్న కారణాలకే ఉద్యోగాలు తొలిగిస్తున్న సింగరేణి కంపెనీ దుర్మార్గ ప్రవర్తనకు ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలకు చెందిన ఆదివాసీ,దళిత, వెనుకబడిన సామాజిక వర్గాల కార్మికుల కుటుంబాలు నేడు ఒక్కపూట తిండికి కూడా నోచుకోక అన్నమో రామచంద్రా అంటూ ఆత్మహత్యలకు, ఆకలిచావులకు గురవుతున్నారు.

వాస్తవంగా ఈ కార్మికులందరిలో మెజారిటీ కార్మికులు కారుణ్య నియమాకాలు ఓపెన్ కాస్ట్ గనుల వలన భూములు కోల్పోయిన వారికి ఇచ్చిన ఉద్యోగాలు పొందిన వారు కూడా ఉన్నారు. పదివేల మంది ఈ డిస్మిస్‌డ్ కార్మికులలో ఆరు వేల మంది కార్మికులు ఈ నియామాకాలలోనే సింగరేణిలో ఉద్యోగాలు పొందారు. మెట్రిక్యులేషన్ నుంచి డిగ్రి, పోస్టుక్షిగాడ్యుయేషన్ చదువుకున్న వీరికి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చే బదులు కేవలం జనరల్ మజ్దూర్ (కఠినమైన పనిచేసే కూలీ)గా ఉద్యోగాలివ్వడం వలన వీరు ఆ పనిని తట్టుకోలేక, త్వరితగతిన అనారోగ్యపాలై ఆస్పవూతులలో చేరడం వలన వేతన దినాలు తక్కువ ఉన్నాయనే పేరుతో వీరందరిని అంచెంచెలుగా తొలగించారు. ఒకవైపు వైద్యులు ఆస్పవూతుల్లో చేరమని ఉద్యోగులకు సలహాలు ఇస్తుండగా, మరోవైపు అధికారులు డ్యూటీకి రాలేదనే పేరుతో తొలగించిన ఈ కార్మికులు కార్మిక న్యాయస్థానాలను,రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని,రాష్ర్ట మానవ హక్కుల కమిషన్‌లను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది.

సింగరేణి కంపెనీలో నాలుగు వేలమంది అధికారులు, మినిస్ట్రీయల్ స్టాఫ్ ఉంటే ఇందులో 80శాతం సీమాంధ్ర ప్రాంతానికే చెందినవారే. ఇందులో కేవలం 20శాతం మాత్రమే తెలంగాణ వారు ఉన్నారు. తెలంగాణ సకల ఉద్యోగ రంగాలలో సీమాంధ్రులు ఏవిధంగా తిష్టవేశారో సింగరేణిలో కూడా అంతకు రెట్టింపు గా తిష్ట వేయడం వలన తెలంగాణ ప్రాంత ప్రజలకు ఈ దుస్థితి పట్టింది. గొడ్డుచాకిరిలో తెలంగాణవారు, అతి సున్నితమైన ఉద్యోగాలలో సీమాంవూధవారు ఏలుతుండడం వలన దశాబ్దాల తరబడి తెలంగాణవారు జనరల్ మజ్దూర్‌గా, బదిలి ఫిల్లర్‌గా, కోల్ ఫిల్లర్‌గా, కోల్‌కట్టర్‌గా జీవితాలను వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సింగరేణిలో డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం గురించి కంటితుడుపు చర్యగా 1995లో ఒకసారి, 2000లో ఒకసారి, 2005లో ఒకసారి డిస్మిస్ అయిన కార్మికులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన ఉన్నత అధికార స్థాయి కమిటీ ఇంటర్వ్యూకు హాజరైన కార్మికులలో 5శాతం కూడా తీసుకోలేదు. సుదీర్ఘకాలం ఈ డిస్మిస్‌డ్ కార్మికులు పడుతున్న బాధలు గుర్తింపు పొందిన యూనియన్‌కు గాని, యాజమాన్యానికి గాని, ప్రభుత్వాలకు గాని పట్టకపోవడం వలన వీరి జీవితాలు సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. తెలంగాణ వనరైన ఈ కార్మికులు సింగరేణి ఉద్యోగంలోకి తీసుకోకపోవడం వలన వందలాది మంది ఇతర కాయకష్టాలు చేసి కుటుంబాలను పోషించలేక నానాయాతన పడుతున్నవారు కొందైతే, బతుకు బండిని ఇడ్వలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు కొందరైతే, ఈ బాధలను తట్టుకోలేక మతి చలించిన వారు కొందరు కాగా, ఆకలి చావులకు గురైనవారు, అనారోగ్యాలపాలై ఈ లోకం నుంచి వెళ్ళిపోయినవారు వేలాదిగా ఉన్నారు.

నవ యువకులు, విద్యావేత్తలుగా ఉన్నవారు కూడా ఆరోగ్యంగా ఉన్నాం, కాయకష్టమైన చేస్తాం,అండర్ గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ ఏ గనులలోనైనా పనిచేస్తాం ఆఖరికి అంటెండర్ పనైనా చేస్తాం. పని ఇవ్వండంటూ మొత్తుకుంటున్న ఈ డిస్మిస్‌డ్ కార్మికుల గోడు యాజమాన్యానికి ఏమాత్రం పట్టడంలేదు. ఇంతగా దుర్భర జీవితం గడుపుతున్న కార్మికులను బాధలను తెలంగాణ రాజకీయపార్టీలు కాని, ప్రజా సంఘాలు కాని పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోవడంలేదు. డిస్మిస్ అయిన వెంటనే కంపెనీ క్వార్టర్ నుంచి వెళ్లగొట్టిన కార్మిక కుటుంబాలు నిలువనీడలేక అత్యంత దుర్భరంగా రోడ్లపక్క ప్లాస్టిక్ కాగితాలు టెంట్‌లుగా మార్చి కుటుంబాలకు కుటుంబాలు జీవిస్తూ నరకయాతన పడుతున్నారు.

ఈ తరుణంలో ఉత్తర తెలంగాణ మానవ వనరైన డిస్మిస్ కార్మికుల్ని, తెలంగాణ సహజ వనురైన సింగరేణిని రక్షించాలని మూడేళ్లుగా సింగరేణి డిస్మిస్‌డ్ కార్మిక సంఘం తెలంగాణ ప్రజా ఫ్రంట్ సంయుక్తంగా సింగరేణి యాజమాన్య దుర్మార్గ చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నది. 2011 ఏప్రిల్ 20 నుంచి మేడే వరకు నాటి తెలంగాణ ప్రజావూఫంట్ అధ్యక్షులు గద్దర్, సింగరేణి కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వంలో బొగ్గు బాయి నుంచి బాయి వరకు తిరిగి కార్మికులను చైతన్యం చేస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేయడం జరిగింది. ఆ మరుసటి నెల జూన్ నెలలో డిస్మిస్‌డ్ కార్మికుల సమస్యను కూడా పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్‌తో జూన్ 5నుంచి సమ్మెకు పిలుపు నివ్వగా ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఇతర కార్మిక సంఘాలు ప్రయత్నించినా మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయి ఆగస్టులో యాజమాన్యంతో జరిగిన ఒప్పందంలో డిస్మిస్‌డ్ కార్మికుల సమస్యనే ప్రధానంగా తీసుకొని 2000 జనవరి1 నుంచి 2010 డిసెంబర్ 31 వరకు డిస్మిస్ అయిన కార్మికులందరినీ కూడా తిరిగి ఇంటర్వ్యూ చేయాలని గుర్తింపు పొందిన కార్మిక యూనియన్ మీద ఒత్తిడి తెచ్చిన ప్రజా ఫ్రంట్ ఆ మేరకు ఒప్పందంలో విజయం సాధించింది.

ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇంటర్వ్యూలు జరపని యాజమాన్యానికి వ్యతిరేకంగా వెంటనే ఇంటర్వ్యూలు జరపాలని హైపవర్ కమిటీని వెంటనే రద్దు చేయాలని ఎనిమిదిసార్లు సింగరేణి కేంద్ర కార్యాలయం హైదరాబాద్ ఎదుట, మూడుసార్లు కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ ప్రజావూఫంట్ నాయకత్వంలో పెద్ద ఎత్తున డిస్మిస్‌డ్ కార్మికులు ధర్నాలు, ముట్టడిలు చేయగా, ఏప్రిల్16 నుంచి 27 వరకు సింగరేణి యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న సమయంలోనే యాజమాన్య కార్మిక వ్యతిరేక ప్రవర్తన పిచ్చుక మీద బ్రహ్మస్త్రం సంధించినట్లు ఈ డిస్మిస్‌డ్ కార్మికులను నానా అవమానాలకు గురిచేస్తూ ఇంటర్వ్యూలు 2249 కార్మికులకు పూర్తిచేశారు.

ఇంటర్వ్యూ పూర్తిచేసిన కార్మికులకు నెలల తరబడి ఉద్యోగాలు ఇవ్వకుండా జాప్యం చేసిన సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా 2012 సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో మహా ధర్నా చేయగా కదిలి వచ్చిన సింగరేణి యాజమాన్యం మొదటి విడతగా కేవలం 66 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది. ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిస్మిస్‌డ్ కార్మిక సంఘం నాయకత్వంలో మరొకసారి ఉద్యమానికి పిలుపునిచ్చి అటు హైదరాబాద్‌లో ఇటు కొత్తగూడెంలో కేంద్ర కార్యాలయాల ముట్టడి పలు దఫాలుగా చేయడం వలన దిగివచ్చిన సింగరేణి యాజమాన్యం 2012 జనవరి 28న 426 మంది డిస్మిస్‌డ్ కార్మికులకు ఉద్యోగాలు ఇస్తున్నట్లు సర్క్యులర్ విడుదల చేసింది.

వేలాది మంది డిస్మిస్‌డ్ కార్మికులు, డిస్మిస్ అయి చనిపోయిన వారి కుటుంబాలు, డిస్మిస్ అయి అన్‌ఫిట్ అయిన వారి కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని, అర్హతలేని వారికి ప్రభుత్వ ఉద్యోగికి ఇస్తున్న ఎక్స్‌క్షిగేషియా ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైన లేదు.

తెలంగాణ భూమి పుత్రులైన ఆదివాసీ దళిత, వెనుకబడిన వర్గాల కార్మికులను ఈ సీమాంధ్ర సింగరేణి ఉన్నతాధికార యం త్రాంగం డిస్మిస్ చేస్తూనే ఉంటుంది. డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకుండా ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. ఈ సీమాంధ్ర ప్రభుత్వ మద్దతుతో సింగరేణి ఉన్నతాధికార యంత్రాంగం కొనసాగిస్తున్న సింగరేణి, కార్మిక వ్యతిరేక చర్యలను అడుగడుగునా ఎదిరించాలి. సింగరేణి యాజమాన్యం మెడలు వంచి కార్మిక అనుకూల చర్యలకు దిగివచ్చేలా పోరాటం చేయాలి. ఈ పోరాటంలో తెలంగాణ విశాల ప్రజా శక్తులు ముందుకు కదులుతేనే మన సింగరేణి మనకు దక్కుతుంది. మన కార్మికులను మనం రక్షించుకున్నవాళ్లం అవుతాం. ఆ దిశగా కార్మికులు పోరాటం చేయటానికి సన్నద్ధం కావాలి.

-చిక్కుడు ప్రభాకర్

35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘

Featured Articles