దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ


Thu,December 13, 2012 04:17 PM

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా ఇందులో 727 మంది ప్రతినిధులు పట్టణ ప్రాంతం నుంచి కాగా 1544 మంది గ్రామీణ ప్రాంతం నుంచి ఎన్నికయ్యారు. ఈ కాంగ్రెస్‌లో నూతన ప్రధాన కార్యదర్శితో పాటు 9మంది కలిగిన పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యులను ఈ కాంగ్రెస్ ఎన్నుకున్నది. గతంలో మార్క్సిజం లెనిని జం మావోయిజంపై విశ్వాసం కలిగిన, ఉక్కు క్రమశిక్షణ కల్గిన వ్యక్తులకు మాత్రమే ఈ పార్టీలో సభ్యత్వం కల్పించేవారు. కాని 2001నుంచి ప్రైవేటు వ్యాపారస్తులకు, బడాపెట్టుబడిదారులకు కూడా సభ్యత్వ అవకాశం కల్పించారు. నేటి చైనా కమ్యూనిస్టు పార్టీలో కేంద్రీకృతమే తప్ప ప్రజాస్వామ్యం అనేది లేకుండాపోయింది. నేడు ముఠాలు, వర్గాలు తప్ప పార్టీలో అందరూ సమానమనే ప్రజాస్వామిక స్ఫూర్తి కరువైంది.

చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా పిడచకట్టుకుపోయింది. మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నవారు వ్యక్తిగత ఆస్తులు విపరీతంగా పెంచుకున్నారు. ప్రస్తుత అధ్యక్షులు హూ జింటావో క్విడ్ వూపో కో ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఈ నాయకత్వం అంతా ఒకప్పుడు పేద రైతాంగం, భూమిలేని కూలీలు, కార్మిక కుటుంబాల నుంచి ఎదిగిన వారే. మహత్తర చైనా విముక్తి పోరాటంలో తమ శక్తియుక్తులనంతా వెచ్చిం చి, జపాన్ వలస పాలన నుంచి చైనాను విముక్తి చేసినవారిలో భాగమే.
చైనా కమ్యూనిస్టు పార్టీకి మహత్తర పోరాట చరిత్ర ఉన్నది. 1921, జూలై నెలలో షాంగైలో జరిగిన మొదటి మహాసభలో 195 మంది సభ్యులతో చైనా కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడింది. ఈ పార్టీకి చెన్ డ్యూక్స్ మొదటి ప్రధాన కార్యదర్శిగా నాయకత్వం వహించారు. ఇతను 1921-22, 1925-27 సంవత్సరాల్లో కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నేడు చైనా జనాభా 130 కోట్లు కాగా, ఈ పార్టీకి 8 కోట్ల 30లక్షల పార్టీ సభ్యులు ఉన్నారు. నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2వ అతిపెద్ద వ్యవస్థగా నిలబడింది. ఫ్యూడల్ వ్యవస్థను నిర్మూలించి నవ చైనాను ఏర్పాటు చేసేందుకు ఉద్భవించిన చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రపంచ చరివూతలోనే విశిష్ట స్థానం ఉన్నది.

సన్‌యట్‌సేన్ నాయకత్వంలో దున్నేవానికే భూమి కావాలని మొదలైన ఉద్యమం మహత్తరమైన రీతిలో మే4 ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్య మం చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు దోహదపడింది. జపాన్ వలస పాలనకు వెన్నుదన్నుగా ఉన్న చియాంగ్ కై షెక్ లాంటి వారిని ఎదుర్కొని నిజమైన ప్రజాస్వామ్యం, స్వావలంబన, సౌభ్రాతృత్వం పునాదిగా ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించేందుకు మార్క్సిజం లెనినిజాన్ని ఆ దేశ భౌతిక పరిస్థితులకు అణుగుణంగా సృజనాత్మకంగా అన్వయించి జనచైనాను నిర్మించేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ సుదీర్ఘ పోరాటమే చేసింది. ప్రజలే చరిత్ర నిర్మాతలు గా మే4 ఉద్యమం,హునాన్ ప్రయోగం, కొమింగ్‌టాంగ్‌తో ఐక్య సంఘటన, లాంగ్ మార్చ్, నాలుగు వర్గాల ఐక్య సంఘటన (కార్మి, కర్షక పెటీబూర్జువా, జాతీయ బూర్జువా) ప్రధాన పాత్ర వహించాయి. ఈ మహత్తర కర్తవ్యం సాధించేందుకు 1943లో చైర్మన్ గా ఎన్నుకోబడిన మావోసేటూంగ్ ప్రవేశపెట్టిన మూడు అద్భుత ఆయుధాలైన బలమైన పార్టీ, ప్రజాసైన్యం, ఐక్య సంఘటన క్రియాశీలక పాత్ర వహించాయి.

రెండో వూపపంచ యుద్ధంలో జర్మనీ,ఇటలీ, జపాన్‌కు మద్దతు పలికి చైనాప్రజలను క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేశారు. జపాన్ వలస పాలనకు వ్యతిరేకంగా ఆ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి 1949అక్టోబర్1నాటికి చైనా జపాన్ వలస పాలన నుంచి విముక్తి అయింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించిన చైనా కమ్యూనిస్టుపార్టీ చైర్మన్ మావోసేటూంగ్ ప్రజల మద్దతుతో చైనా అధ్యక్షులు అయ్యా రు. వలస పాలన నుంచి విముక్తి చెందిన చైనా ప్రజలు సంతోషంతో కాలం గడపలేదు. విశాల చైనాను ప్రజల స్వావలంబనతో సాధించే అభివృద్ధి, కఠోరక్షిశమతో మహత్తర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి బీజింగ్ వరకు ఎటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యత్యాసాలు లేని వ్యవస్థను సృష్టించేందుకు వీరు చేసిన ప్రయత్నం అంచెలంచెలుగా విజయాన్ని సాధించేవైపు పయనించింది.

అసమాన కఠోర శ్రమతో ప్రపంచ సోషలిజం పట్ల నిబద్ధతతో పక్కనే ఉన్న వియత్నాంతో పాటు ప్రపంచదేశాల ప్రజలకు స్ఫూర్తినిచ్చారు.1953లో సోవి యెట్ యూనియన్ అధినేత స్టాలిన్ మరణాంతరం ఆ దేశం సోషలిస్టు వ్యవస్థ నుంచి పెట్టుబడిదారి వ్యవస్థకు మారిన క్రమాన్ని సమక్షిగంగా పరిశీలించడమైనది. 1963 లో దాదాపు 109 దేశాల కమ్యూనిస్టు పార్టీల భాగ స్వామ్యంలోచైనా కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ మావోసేటూంగ్ నాయకత్వంలో గ్రేట్ డిబేట్ జరిగింది. రష్యా మార్క్సి జం లెనినిజం మార్గదర్శకాలను పూర్తిగా వదులుకుని పెట్టుబడిదారి వ్యవస్థలో ప్రవే శించిందని నిర్ధారించి ప్రపంచ ప్రజలకు ఆదేశ బూటకత్వాన్ని ఈ చర్చ వెల్లడించింది.

చైనాలో అధికారానికి వచ్చిన తరువాత కమ్యూనిస్టుపార్టీ శాస్త్రీయ దృక్పథంతో కిందినుంచి పైకి, పైనుంచి కిందికి ఎలాంటి వ్యత్యాసాలులేని సమాజాన్ని సృష్టించడానికి ఉన్న అవకాశాన్ని పూర్తిగా త్యజించింది. నేడు సెంట్రల్ కమిటీలో, పొలిట్ బ్యూరో, పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీలో ఉన్న నాయకత్వం గురువులు చైనా ప్రజల మనుగడను దెబ్బతీశారు. ప్రపంచానికే ఒక మార్గాన్ని చూపే చైనాను నిర్మిద్దామనుకున్న మావో కలలను కల్లలుగా మార్చిన దుర్భిద్ధి ఈ నాయకత్వానిది. వీరు సమసమాజ నిర్మాణానికి దోహదపడే భావాలను కమ్యూనిస్టుపార్టీ నిర్మాణంలో ప్రవేశపెట్టలేదు. సరైన భావాలను ప్రవేశపెట్టిన మావోను సమర్థించలేదు. ఆయన బాట లో పయనించలేదు. ఆయనను ప్రతివిషయంలో మైనార్టీ చేసి చైనా అభివృద్ధిని అడ్డుకున్నారు. మావో నాయకత్వంలో అనన్య త్యాగాలతో ప్రజలు సాధించిన ఈ విజ యం కనీసం మూడు దశాబ్దాలు కూడా నిల్వకుండా చేశారు. నేడు ప్రపంచంలో ఒక సోషలిస్టు శిబిరం కూడా లేకుండా చేసిన ఘనత వీరిది.

అవసరమైనంత తిండి చేతనైనంత పనిచేసి జవజీవాలు తొణికిసలాడే నూతన వ్యవస్థ (సోషలిజం)ను సాధిస్తూ మానవులంతా సహోదరులుగా సమానంగా వ్యక్తిగత ఆస్తులులేని సమసమాజాన్ని నిర్మిద్దామనుకున్న నూతన చైనా కలలు మూడు దశబ్దాలలోనే కల్లలుగా, కల్లోలాలు గా మారాయి. ఒక దశలో ‘బంబార్డ్ ద హెడ్ క్వార్టర్స్’ అంటూ మావో నాయకత్వం లో చైనా కమ్యూనిస్టు పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు ఇచ్చిన పిలుపును కూడా క్యాడర్‌కు, ప్రజలకు చేరకుండా నియంతృత్వం వహించిన చరిత్ర వీరిది. చైనా కమ్యూనిస్టు పార్టీని ప్రజా అనుకూల ధృడమైన నాయకత్వంగా తీర్చిదిద్దేందుకు చైనా సమాజాన్ని సాంస్కృతిక విప్లవం (1966-76) ద్వారా మార్చేందుకు మావో చేసిన ప్రయత్నాన్ని తిరస్కరించడంతోపాటు పెట్టుబడిదారీ సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలను నాడే తీవ్రంగా చేశారు. అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న సోషలిస్టు బీజరూపం ఈ నాయకత్వ విద్రో హం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది.

సెప్టెంబర్9,1976న మావో చనిపోయిన తర్వాత 1976నుంచి 81 వరకు అధ్యక్షత వహించిన డెంగ్ ప్రవేశపెట్టిన పెట్టుబడిదారీ ఆర్థిక సంస్కరణలు దేశంలోని ప్రజల పాలిట మరణ శాసనాలుగా మారాయి. మహత్తర సాంస్కృతిక విప్లవంలో మావో ప్రవేశపెట్టిన అభివృద్ధి కరమైన విధానాన్ని సమర్థించిన ఆయన సహచరిణితో పాటు మరో ముగ్గురు పార్టీ ఉన్నతనాయకులైన జీయాంగ్ కింగ్, జాంగ్ చుమ్‌కియో, యహో యాన్, వాంగ్ హంగ్ వెన్‌లన్ అరెస్టు చేసి సరియైన విచారణ లేకుండా శిక్షించారు. మావో సహచరి 1991లో జైలులోనే ఆత్మహత్య చేసుకోగా, మిగతా ముగ్గురు 1992- 2005 మధ్యలో జైళ్లలోనే మరణించారు. మావో చనిపోయిన తర్వాత ఈ నాయకత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడిదారి ఆర్థిక సంస్కరణలతో ప్రజాబాహుళ్యంలో నామ మాత్రంగా ఉన్న వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోయాయి.

మానసికక్షిశమకు శారీరక్షిశమకు, గ్రామీణ రైతాంగానికి పట్టణ ప్రజానీకానికి, గ్రామీణ పరిక్షిశమలకు పట్టణ పరిక్షిశమలకు,స్త్రీ-పురుషలకు సబంధించిన రంగాలలో విపరీతంగా వ్యత్యాసాలు పెరగడంతో చైనా కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాలలో మొదటిది నిజమైన ప్రజాస్వామ్యం కలిగిన నూతన ప్రజాస్వామిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. గత మూడున్నర దశాబ్దాలుగా చైనా ప్రజలలో నిరుద్యోగం, ఆకలి, దారిద్య్రం పెచ్చుపెరిగి సామాన్య ప్రజలకు కనీస జీవన అవసరాలు కూడా తీరని పరిస్థితి ఏర్పడింది.
నేడు చైనాలో 70 శాతం ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితి దారుణంగా దిగజారింది. గుప్పెడు మంది చేతిలోనే అపారమైన సంపద కేంద్రీకృతమైంది. విశాల ప్రజానీకానికి అవసరమైన ఉత్పత్తి పూర్తిగా దిగజారిపోయింది.

గ్రామీణ రైతాంగం, భూమిలేని కూలీలకు ఒకపూట కూడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. నేడు చైనాలో ప్రపంచంలోనే అత్యధికంగా స్పెషల్ ఎకనామిక్ జోన్‌లు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతి తక్కువ జీతభత్యాలతో కూడిన నైపుణ్యంగల మానవ శ్రమ చైనాలోనే దొరుకుతున్నది. 1990 దశకంలో రష్యాలో ఏర్పడిన పాలు, రొట్టె కూడా దొరకలేని పరిస్థితి ఏవిధంగా నెల కొందో రాబోయే రోజుల్లో చైనాలో కూడా ఏర్పడబోతున్నది. రెండంకెల ఆర్థిక వృద్ధి పేరుతో 2010లో 68బిలియిన్ డాలర్ల విదేశి పెట్టుబడులు, 2011లో 115బిలియన్ డాలర్ల విదేశి పెట్టుబడులను చైనా ఆహ్వానించిందంటే అక్కడి ప్రజల జీవన ప్రమాణం ఎంతగా దిగజారిందో తెలుస్తున్నది.

-చిక్కుడు ప్రభాకర్

35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘

Featured Articles