అన్నీ దోపిడీ యాత్రలే!


Fri,December 7, 2012 03:12 PM

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ, బహుళజాతి కంపెనీలకూ అండగా నిలిచి ప్రజలను వేపుకు తిన్నారు. దోపిడీదారుల ప్రయోజనాలే.. పరమావిధిగా పాలన సాగించి ప్రజలపై కత్తి దూశారు. ప్రశ్నించిన గళాలను అంతం చేసేందుకు నడుం కట్టారు. తుపాకీ నీడన పాలన సాగించి ప్రజల వద్దకు పాలన అంటూ.పజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. అయితే.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వైఎస్ వారసులు తగుదునమ్మా అంటూ..జనం దగ్గరకు పాదయావూతల పేరుతో ప్రజల దగ్గరకు పోతున్నారు.
వీరిది ఒక్కొక్కరిది ఓ చరిత్ర. అందరిదీ నయవంచక చరిత్ర. ఔరంగాజేబు లా అధికారం కోసం సొంతమామనే వెన్నుపోటు పొడిచి అధికార పీఠమెక్కిన చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి చిలుకపలుకులు పలుకుతాడు. తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజాస్వామ్య హక్కులకు పాతరేసి పచ్చి నియంతృత్వాన్ని నెలకొల్పాడు. అధికార దర్పంతో సర్వం తానై.. ప్రజా వ్యతిరేకిగా నిలిచాడు. విద్యుత్ చార్జీలు తగ్గించమన్నందుకుతుపాకీ గుండ్లు కురిపించి రక్తపుటేరులు పారించాడు. తమ గోడు వినాలన్నందుకు అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించి మహిళలంటే తన చూపు ఎలాంటిదో చాటుకున్నాడు.

ఏఇజాలు లేవు టూరిజం తప్ప అంటూ..ఫక్తు కార్పొరేట్ భాష మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అని రైతులను హేళన చేశాడు. తన అస్తవ్యస్థ, అక్రమ పాలనను ప్రజల మీద రుద్దాడు. తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోయినా..తన తొత్తులకు, తాబేదార్లకు రాష్ట్రాన్ని దోచిపెట్టాడు. ఇన్నేళ్లైనా.. నేటికీ టీడీపీకి, బాబుకూ తాబేదార్లుగా మిగిలిం దిఅలాంటి తొత్తులే. పేదల భూములను సీమాం ధ్ర పెట్టుబడిదారులకు అనేక అక్రమ మార్గాల్లో దోచి పెట్టారు. ప్రాజెక్టులు, పరిక్షిశమలు, స్టూడియోలు, ఫిల్మ్‌సిటీల పేర వేలాది ఎకరాల భూమి ని కట్టబెట్టారు. అలా ఎదిగి నేడు బడా పెట్టుబడిదారులుగా చెలామణి అవుతున్నారు. మరో వైపు దశాబ్దాలుగా రాష్ట్ర పురోభివృద్ధిలో భాగమవుతూ.పజల మన్ననలు పొందిన ప్రాగాటూ ల్స్, ఐడీపీఎల్ , ఈసీఐఎల్, రిపబ్లికన్ ఫోర్జ్, హెచ్‌ఎంటీ,ఆల్విన్, బెకలైట్ హెలెమ్, స్పిన్నింగ్ మిల్లులలాంటి వాటిని ఖాయిలా పడేసి మూసివేశాడు. ఆ తర్వాత ఈఫ్యాక్టరీలకు చెందిన వేలాది ఎకరాల భూములను తన అడుగులకు మడుగులొత్తే వారికి అప్పజెప్పాడు.అలాగే తెలంగాణలోని ఆజాంజాహీ మిల్లు, సర్‌సిల్స్, అంత ర్గాం లాంటి స్పిన్నింగ్ మిల్లులను, నిజాంషుగర్స్, పాల్వంచలోని ఐరన్ కంపెనీలను దివాలా తీయించి సీమాంధ్ర పెట్టుబడిదార్లకు అప్పనం గా కట్టబెట్టాడు. ఆ పెట్టుబడిదారులే నేడు చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

అలాంటి దోపిడీని కొనసాగించేందుకే బాబు పాదయాత్ర పేరుతో మళ్లీ గ్రామాల వెంట తిరుగుతున్నాడు. ఇక షర్మిల కూడా ఈ కోవలోనే తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. వైఎస్ 2004లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2009 వరకు రాష్ట్రాన్ని దోచి తన అనుయాయులకు అప్పజెప్పడమే పనిగా సాగింది. ప్రజల ఆస్తులను జీఎంఆర్, జీవీకే, కావూరి, రాయపాటి, మేకపాటి, లగడపాటి, బ్రదర్ అనిల్‌కుమార్, పెన్నా ప్రతాప్‌డ్డి, రస్‌అల్‌ఖైమా, తనకొడుకు జగన్‌కు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకొమ్మని అప్పజెప్పాడు. తెలంగాణ నినాదాన్ని అడ్డం పెట్టుకొని, టీఆర్‌ఎస్‌తో జతకట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే.. వందకోట్ల మంది ప్రజల అభివూపాయం కావాలని తెలంగాణ ప్రజలను వంచించాడు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన జగన్ అధికారాన్ని వారసత్వంగా పొందేందుకు ప్రయత్నించాడు. దీంతో కాంగ్రెస్‌తో బెడిసి బయటకి వచ్చి తనే కొత్త పార్టీ పెట్టి ఓదార్పు యావూతల పేరిట బల సమీకరణ చేసుకున్నాడు. అయితే జగన్‌కు కళ్లెం వేసేందుకు కేంద్రం అవినీతి ఆరోపణలతో జైలు పాలు చేసినా.. , తన చెల్లెలుతో పాదయావూతలు చేయిస్తున్నాడు.

ఇలా అధికారం కోసం బాటలు వేసుకునేందుకు చేసే ప్రయత్నాల్లోంచే రకరకాల పేర్లతో పాదయావూతలు సాగిస్తున్నారు.అటు బాబు, షర్మిల ఇద్దరూ పోటాపోటీగా ప్రజలను మబ్యపె పాదయావూతల పేరిట జనంలోకి వస్తున్నారు. వీరికి తోడు ఇందిరమ్మ బాట పేరుతో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి కూడా ప్రజలను బొల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ప్రజాస్వామ్యదేశంలో ప్రజల అభివూపాయానికి విలువనిచ్చి పాలన సాగించాల్సిన ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు దాసోహం అంటున్నాయి. వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు వాటికి వంతపాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో యాత్రలు కొనసాగించే అర్హత లేదు. ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం వీరోచితంగా పోరాడుతున్నారు. అయితే ప్రజా ఉద్యమాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం అణచివేతకు పూనుకుంటున్నది. ఏకాభివూపాయం పేరుతో తెలంగాణ సమస్యను తుంగలో తొక్కుతున్నది. యాత్రల పేరుతో వైఎస్ జగన్, చంద్రబాబులు మానుకోట, పాలకుర్తిలను తమ గూండాల బలంతో తెలంగాణ ప్రజలపై కాల్పులు, దాడులు కొనసాగించి రక్తపు పారించారు. అలాగే వరంగల్ జిల్లా రాయినిగూడెంలో మా రాష్ట్రం మాకు కావాలి అని నినదించిన మహిళలు, విద్యార్థులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసింది.

ఇప్పటికి వారిపై పోలీసులతో నిఘా కొనసాగిస్తున్నది. సిరిసిల్లలో చేనేత కార్మికులను ఓదార్చని విజయమ్మ అధికార పార్టీ అండతో, తన భర్త ఏ విధంగా ఫ్యాక్షనిస్టు పాలన కొనసాగించారో ఆ విధంగా సిరిసిల్ల ప్రజలపై దమనకాండ కొనసాగించింది. ఆ నెత్తుటి గాయాలు ఇంకా మానకముందే తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకముందే చంద్రబాబు ఈ ప్రాంతంలో పాదయావూతను కొనసాగిస్తున్నాడు. రేపు షర్మిల కూడా తెలంగాణలో తన యాత్ర కొనసాగించదలుచుకున్నది.

తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి తెలంగాణ ప్రజల మీద దమనకాండను కొనసాగించిన ముఖ్యమంత్రి, ఈ సమస్య రాజకీయాల కోసం రాష్ట్రా న్ని విభజించలేం అని ప్రకటించారు. అలాగే ఈ ప్రాం త తెలంగాణ వ్యతిరేకుల అండతో ఇందిరమ్మ బాటతో ప్రజలను మరింత దగా చేసేందుకు తెలంగాణలో పర్యటించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని తెలంగాణ ప్రజలు కచ్చితంగా అడ్డుకోవాల్సిందే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ప్రజాభివూపాయాలకు విలువ ఇవ్వని పార్టీలు, పెట్టుబడిదారుల ఒత్తిడి తలొగ్గి ప్రజల ఆకాంక్షను తిరస్కరిస్తున్నాయి. కాబట్టి రాజకీయ, ప్రజాసమస్యల పేరుతో తెలంగాణలో తిరిగే అర్హతను కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలు కోల్పోయాయి. రాజ్యాంగంలోని అధికరణ 19కి విలువ ఇవ్వని చంద్రబాబు, రాజశేఖర్‌డ్డి, కిరణ్‌కుమార్‌డ్డి లు, వారి వారసులు ప్రజాస్వామ్యం గురిం చి, ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత కోల్పోయారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం మా రాష్ట్రం మాగ్గావాలె అని ప్రజలు ఉద్యమిస్తుంటే అడ్డుపడుతూ భిన్నాభివూపాయాల పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కారు. ప్రజాస్వామ్యం అనే పేరుతో నియంతృత్వాన్ని కొనసాగిస్తూ తమ పర్యటనలను అడ్డుకుంటే పోలీసులతో, తమ గూండాలతో ప్రజలపై దాడులు, కాల్పులు చేయిస్తూ, ఇప్పు డు చిలుకపలుకులు పలుకుతున్నారు.

ఆసియా ఖండానికే వన్నె తెచ్చిన నిజాం షుగర్స్‌ను సీమాంధ్ర పెట్టుబడిదారులకు అప్పజెప్పిన చంద్రబాబు నిజామాబాద్ జిల్లాలో ప్రజలకు ఏ ముఖంతో ప్రజాసమస్యల గురించి మాట్లాడేందుకు వెళ్తారు? కరీంనగర్, ఆదిలాబాద్,వరంగల్,ఖమ్మం జిల్లాల్లో సర్‌సిల్క్,అంతర్‌గాం,అజాంజాహీ లాంటి మిల్లుల ఆస్తులను, ఇతర సంపదలను తమ అనుచరులకు అప్పజెప్పి, నేడు ఏ ప్రజాసమస్యల కోసం ఆ జిల్లాల పర్యటనకు వెళ్తారు? ఖమ్మం జిల్లా లో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతంలోని బయ్యారం గనులను బినామీ పేర్లతో దక్కించుకున్న షర్మిల ఏ ప్రజా వూపయోజనం కోసం ఖమ్మం జిల్లాలో పర్యటించాలనుకుంటున్నారు? మానుకోటలో తన అన్న,ఆయన అనుచరులు సృష్టించిన దుర్మార్గ హింసాకాండలో బలైపోయిన తెలంగాణ బిడ్డల గాయాలు ఇంకా మానకముందే ఏ విధంగా తెలంగాణలో పర్యటిస్తారు?

తెలంగాణ ప్రజల సంపదను దోచుకొని, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటూ మరోసారి అటువంటి పాలననే తెస్తామంటూ తెలంగాణ ప్రాంతానికి వస్తున్న వీరి యాత్రలను అడ్డుకునే హక్కు ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. మరో మానుకోట, మరో పాలకుర్తి, మరో సిరిసిల్లను, మరో రాయినిగూడెంలను సృష్టించాల్సిందే. ఈ యాత్రల్లో వస్తున్న గూండాలకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. వారికి వంతపాడుతున్న వారిని అడ్డుకోవాల్సిందే. అప్పుడే తెలంగాణ బిడ్డలైన నాటి సమ్మక్క, సారలక్క, కొమురం భీం, పాలకుర్తి ఐలమ్మ, దొడ్డికొమురయ్య లాంటి వేలాది తెలంగాణ ముద్దుబిడ్డల త్యాగాలకు సరైన నివాళి అవుతుంది.

-చిక్కుడు ప్రభాకర్

35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘

Featured Articles