కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు


Fri,December 7, 2012 03:11 PM

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో దేశ ప్రజలను వంచించారు. నాటి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వంలో జరగని కుంభకోణాలు ప్రస్తుత ప్రభుత్వంలోనే జరిగాయి. దేశంలోని అపారమైన సంపదను కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశీయ పెట్టుబడిదారులకు, అంతర్జాతీయ కంపెనీలకు ఉచితంగా కట్టబెడుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. దేశంలో నేటికీ ఒక్కపూట కూడా తిండి దొరకని ప్రజలు దాదాపు 38 శాతం ఉన్నారంటే పాలకుల అవినీతి పాలన ఎలా ఉందో అర్థమవుతుంది. అపారమైన సంపదను గుప్పెడుమంది పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెట్టే నిర్ణయాలు ప్రజల జీవితాలను కుదేలు చేస్తున్నాయి. నాటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నది. దానికంటే ఎక్కువ మోతాదులో నిత్యావసర వస్తువుల ధరల పెంపుదల నిర్ణయం ప్రజ ల మెడపై వేటు వేసినట్లుగా మారింది. ప్రజలు శతాబ్దాలుగా తమ రక్తమాంసాలను ధారపోసి ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పర్చుకున్నారు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులను ఈ దేశ పెట్టుబడిదారులకు, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు కట్టబెట్టింది. ఫలితంగా దేశంలోని కోట్లాది రూపాయల ఆస్తులు ప్రైవేటు పరమయ్యాయి. లక్షలాది సంఘటిత కార్మికులు, కోట్లాది అసంఘటిత కార్మికులు రోడ్డున పడాల్సి వచ్చింది.

ఈ తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచింది. సెప్టెంబర్ 14, అక్టోబర్ 4న ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశంలోకి వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడుల ను అనుమతించారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులను, బహుళజాతి సంస్థలను సంబరపరుస్తూ ప్రజలను మరోసారి దగా చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల చిల్లరదుకాణాలు నడుపుకుంటూ బతుకుతున్న సుమారు ఐదుకోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా రోడ్డున పడబోతున్నాయి. పరోక్షంగా కోట్లాది ప్రజలపై అధికభారం పడనుంది.

ప్రసార, కేబుల్ రంగంలో 74 శాతం, విద్యుత్ శక్తి క్రయ విక్రయరంగం, విమానయాన రంగంలో 49 శాతం, మల్టీ బ్రాండ్ రిటేల్ రంగంలో 51 శాతం, బీమా, పెన్షన్ రంగాల్లో 26 శాతం ఉన్న విదేశీ పెట్టుబడులను 49 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదే సమయంలో 15,000 కోట్ల సమీకరణ కోసం దేశీ య ప్రభుత్వరంగ సంస్థలైన ఆయిల్ ఇండియాలో 10 శాతం, హిందుస్థాన్ కాపర్ 9.59 శాతం నాల్కోలో 12.15 శాతం ఎంఎంటీసీ లో 9.33 శాతం ఆఫర్ ఫర్ సేల్ నిర్ణయం తీసుకున్నది. నాడు ఎన్డీఏ నేడు యూపీఏ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే 186 దేశీయ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించి ప్రజల నడ్డివిరిచాయి. కేంద్రం డీజిల్ ధర పెంచడం వల్ల ట్రక్కుల యజమానులు 15 శాతం చార్జీలు పెంచారు. దీంతో నిత్యావసర వస్తువుల ధర లు 20 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో కేవలం 100 డాలర్లకే ముడిచమురు బ్యారల్ దొరుకుతున్నది. డీజిల్, పెట్రోల్, గ్యాస్ మీద ప్రభుత్వం పన్నుల పేరుతో 42.7 శాతం పెంచింది. గత మూడేళ్లుగా కేంద్రం బడ్జెట్‌లో 49,000 కోట్ల రూపాయలు వివిధ ఆయిల్ కంపెనీలకు సబ్సిడీగా సమర్పించింది. ఆ కంపెనీలు కొంత నష్టాన్నైనా భరించకుండా వాటికి ప్రజల అస్తులను దోచిపెట్టింది. ఆ కంపెనీలు చెప్పినట్టు రాబోయే మూడేళ్లలో 1.60 లక్షల కోట్లు ప్రజలపై భారం వెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం దురదృష్టకరం.

ఇప్పటికే 2జీ స్పెక్రమ్, వివిధ రాష్ట్రాల్లో జరిగిన కుంభకోణాల ఫలితంగా దేశ ప్రజలు ఆపారంగా నష్టపోయారు. బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారులు వ్యాపారం పేరుతో దేశ పాలనను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలకు ఊడిగం చేస్తూ తమ వాటాను తాము దక్కించుకుంటున్నాయి. జార్ఖండ్‌లో లక్షలకోట్ల విలు వ కలిగిన అటవీ సంపదను ఆ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా వివిధ బహుళజాతి సంస్థలకు, దేశీయ పెట్టుబడిదారులకు అప్పజెప్పింది. అలాగే బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లో అపారమైన అటవీ సంపదను ఎస్సార్, జిందాల్, వేదాంత, టాటా లాంటి కంపెనీలకు లక్షల కోట్ల విలువైన ‘ఎంఓయూ’లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ అనుమతితో చేసుకున్నాయి. అలాగే ఆంధ్రవూపదేశ్‌లో విశాఖలోని బాక్సైట్‌ను, బయ్యారం అడవులలోని హైమటైట్, డోలమైట్, లాట్రేట్‌ల వంటి విలువైన ఖనిజ సంపదను, నల్లమల అటవీ ప్రాంతంలోని జింక్, కాపర్, డైమండ్, బంగారం, యురేనియం లాంటి ఖనిజ సంపదను అంతర్జాతీయ సంస్థలైన రస్ ఆల్‌ఖైమా, వేదాంత, డీబీర్స్‌లకు, దేశీయ పెట్టుబడిదారులైన పెన్నా సిమెంటు, రక్షణ స్టీల్స్ లాంటి సంస్థలకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని, రాజ్యాంగబద్ధ పాలన అందిస్తామన్న పాలకులు అన్ని విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తన ఐదేళ్ల పాలనలో ఆపార సంపదను తన కొడుకుకు, అల్లుడికి దోచిపెట్టారు. చిన్న, సన్నకారు రైతుల పొట్టలు కొట్టారు. అనాదిగా సమువూదగర్భాన్ని నమ్ముకొని జీవిస్తున్న లక్షలాది మత్స్యకార కుటుంబాల జీవితాలను ఛిద్రంచేసి, పెట్టుబడిదారులకు కోస్తాతీర ప్రాం తం లో దాదాపు 30 వేల ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. హైదరాబాద్ నగరం చుట్టూ సీమాంధ్ర పెట్టుబడిదారులకు చంద్రబాబుతో పోటీపడి మరింత ఎక్కువ మొత్తంలో వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు సర్వం కేటాయించి భవిష్యత్తులో ఆంధ్రవూపదేశ్‌ను అంధకారం చేసింది.

దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రంగంలో అక్రమాలకు పాల్ప డి, కుంభకోణాలకు ద్వారాలు తెరిచాయి. కేంద్రంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాల మంత్రులు, ఎంపీలు, వివి ధ రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష నాయకులు పీకలలోతు అవినీతిలో కూరుకునిపోయా రు. లక్షలాది కోట్ల ప్రజల సంపదను దక్కించుకొని నేడు ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ అవినీతి కుంభకోణాలను మరుగున పరిచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వం గొప్ప నాటకం ఆడింది. ఆ నాటకంలో భాగమే దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని, కఠిన నిర్ణయాలు తీసుకుం దేశం ఆర్థికాభివృద్ధిని సాధిస్తుందని ప్రధాని ప్రజలను భ్రమింపజేసేందుకు మీడియాలో నీతివచనాలు బోధిస్తున్నారు. 2జీ, కోల్‌గేట్, వివిధ రకాల కుంభకోణాల ను మించి అణుశక్తి రంగంలో అతిపెద్ద కుంభకోణం కేంద్ర ప్రభుత్వ నాయకత్వం లో జరిగింది. ఇప్పటికి ఈ కుంభకోణానికి సంబంధించి 48 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన ‘థోరియం’ మాయమైపోయింది. దీని కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత శక్తుల హస్తం ఉందని, వివిధ కుంభకోణాలను విశ్లేషించిన సంస్థలు ఇప్పటికే అభివూపాయపడుతున్నాయి. కేంద్రం ఈ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందకు ప్రజలపై మరింత భారం వేస్తున్నది. ప్రాథమిక రంగాల్లో విదేశీ పెట్టుబడుల ఆహ్వానం, డీజిల్, గ్యాస్ ధరలను పెంచింది.

ఆరున్నర దశాబ్దాల కిందట వలస పాలకుల నుంచి దేశం విముక్తి పొందింది. ఐదు దశాబ్దాలుగా పరోక్షంగా వారు సూచించిన విధానాలనే దేశ పాలకులు అనుసరిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కి ‘గణతంత్ర’ పాలనకు చరమగీతం పాడి నియంతృత్వాన్ని కొనసాగిస్తున్నారు. నూతన ఆర్థిక విధానాల ఫలితంగా ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణల పేరుతో ప్రజల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో దేశం ‘అర్థవలస నుంచి వలసవైపు’ మళ్లీ పయనిస్తున్నది. ప్రస్తుత ఈ దీనస్థితిలో దేశ ప్రజలంతా ఏకమై అంతర్జాతీయ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, యూపీఏ ప్రభుత్వ దళారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి.

-చిక్కుడు ప్రభాకర్

35

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Published: Fri,December 7, 2012 03:10 PM

సార్వత్రిక తిరుగుబాటు రావాలె

తెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘