సార్వత్రిక తిరుగుబాటు రావాలె


Fri,December 7, 2012 03:10 PM

TG01-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ ఉద్యమానికి 1969లో ఊపిరిపోసిన తెలంగాణ ఉద్యోగుల పోరాట చరిత్ర రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘కలికి తురాయి’. సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘కబంధ హస్తాల’ చెర నుంచి ఈ తల్లిని విముక్తి చేయడానికి తెలంగాణ ప్రాంత ఏడు లక్షల ఉద్యోగులు చూపెడుతున్న పోరాట తెగువ నాలుగున్నర కోట్ల ప్రజలకు స్ఫూర్తినిస్తున్నది. తెలంగాణలోని వనరులతోపాటు, ఉద్యోగాలను కొల్లగొట్టడమే కాక, ఈ ప్రాంతంలోని రాజకీయ నాయకత్వాన్ని కూడా తమ చెప్పుచేతుల్లో ఉంచుకునే సీమాంధ్ర పాలకుల కుతంత్రం మన అనుభవంలో ఉన్నది. ఇది ఉద్యోగులకెరుకేనన్నది వాస్తవం.

1956 కంటే ముందు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఈ పెత్తందార్లు సృష్టించిన అధికార దర్పాన్ని విన్న ఉద్యోగులు, 1956-1968 వరకు తమ మీద మోపిన ఫ్యూడల్ విధానాన్ని అనుభవించారు. సీమాంధ్ర పాలకులకు సేవచేసి తాము తోచినంత దండుకున్న సీమాంధ్ర ఉన్నతాధికారవర్గం తెలంగాణ ప్రజలపట్ల, వనరులపట్ల, ఉద్యోగుల పట్ల చేసిన దోపిడీని తెలంగాణ ఉద్యోగులు ప్రజలకు వివరించారు. తమ ఉద్యోగులు చెప్పిన వాస్తవాలను మదింపు చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోకపోతే భవిష్యత్ అంధకారమేనని భావించారు. విద్యార్థులు సీమాంధ్ర పెట్టుబడిదారులకు ప్రతినిధిగా ఉన్న నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందడ్డి ప్రభుత్వాన్ని స్తంభింపచేశారు.

నాటి తొలి అమరుడు ఖమ్మం జిల్లా కారేపల్లి గ్రామానికి చెందిన ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ప్రకాశ్ కుమార్‌డ్డి . ఆయనను జామై ఉస్మానియా దగ్గర 1969 మార్చి 28న శరీరం తూట్లు పడే విధంగా కాల్చి చంపింది సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రభుత్వం. ఈ పాశవిక కాల్చివేత మీద న్యాయ విచారణ జరపాలని తెలంగాణ ప్రజలు ప్రభుత్వం మీద ఎంతగా ఒత్తిడి తెచ్చినా, నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరించడమే కాక మరింత మారణకాండకు ఉసికొల్పింది.

నేటి తెలంగాణ రాజకీయ నాయకుల్లాగే (దామోదర్ రాజనర్సింహా, దానం నాగేందర్, ముఖేశ్‌గౌడ్, సర్వే సత్యనారాయణ, జగ్గాడ్డి) నాటి వలసవాది వెంగళరావును హోంశాఖ మంత్రిగా నియమించింది. ఆగస్టు5, 1969న కొత్తగూడెంలోని భజనమందిర రోడ్డులోని రామచంద్ర ఆడిటోరియంలో హోంమంత్రి వెంగళరావుకు సన్మానాన్ని ఖమ్మంకు వలస వచ్చిన సీమాంధ్ర భూస్వాములు ఏర్పాటు చేశా రు. ‘తెలంగాణ ప్రజల రక్తం తాగేందుకు నియమించబడ్డ వలసవాది వెంగళరావు గో బ్యాక్’ అంటూ నినదించిన తెలంగాణ విద్యార్థుల మీదికి సిఆర్‌పిఎఫ్ బలగాలను ఉసిగొల్పి వెంగళరావు కాల్పులు జరిపించారు. ఆ కాల్పుల్లో దస్తగిరి, రాంచందర్‌లు చనిపోగా, గడ్డం సత్యనారాయణ, మదనయ్య, మేకల సాంబయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది విద్యార్థులు గాయపడి ఆ తరువాత మెరుగైన వైద్యం అందక చనిపోయారు.
తెలంగాణ ఉద్యమాన్ని అత్యంత క్రూరంగా అణచి వేస్తున్న సీమాంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింప చేశారు.

ఉద్యోగుస్తులకు ప్రజలు తోడవ్వగా, విద్యార్థులు ఉద్యమించారు. అసమాన ధైర్యసాహసాలతో దాదాపు తొమ్మిది నెలలు తెలంగాణలోని ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభింప చేసిన ఘనత నాటి ఉద్యోగస్తులకే దక్కింది. ప్రపంచంలో ఉద్యోగులు తలచుకుంటే దేశాల ప్రభుత్వాలే కూలిన చరిత్ర ఉంది. ఆంధ్రవూపదేశ్‌లో 1986 నవంబర్ 5నుంచి 53 రోజులు ప్రభుత్వ ఉద్యోగులు చేసిన సమ్మె రామారావు ప్రభుత్వాన్ని 1989లో అధికారం దక్కకుండా చేసింది. 2004లో చంద్రబాబు ప్రభుత్వానికి ఇదే గతి పట్టింది. జయలలిత ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులు కన్నెర చేస్తే అన్నాడిఎంకె ప్రతిపక్ష స్థానంలో కూర్చో వలసి వచ్చింది. 2009 నవంబర్‌లో హైదరాబాద్‌లో ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం చరివూతలో కెక్కింది. ఈ మహత్తర ప్రజా ఉద్యమానికి తలొగ్గి డిసెంబర్ 9, 2009న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత పరిణామాలతో సీమాంధ్ర పెట్టుబడిదారులకు అమ్ముడుపోయిన కేంద్ర ప్రభుత్వం 600 మంది పైచిలుకు విద్యార్థి, యువకుల బలిదానాలకు కారణమయింది.

తెలంగాణ ఉద్యోగులు ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటు’లో పెట్టాలంటూ ఆగస్టులో సకల జనుల సమ్మెకు దిగుతున్నారు. వీరికి మద్దతుగా ఇప్పటికే ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ రంగ సంస్థలకు చెందిన లక్షలాది ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నది. ఎస్మా చట్టం ద్వారా తెలంగాణ ముద్దుబిడ్డల ఆకాంక్షలను అణగదొక్కాలని చూస్తున్నది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు ఫిబ్రవరి 17 నుంచి సహాయనిరాకరణ ఆయుధాన్ని ఎక్కుపెట్టారు. ఈ సహాయనిరాకరణ లోనే ఫిబ్రవరి 22, 23 తేదీలలో సార్వవూతిక సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగులకు సంఘీభావంగా ప్రభుత్వరంగ సంస్థలయిన ఆర్టీసీ, సింగరేణి కదిలాయి. అయినా సమా జం మొత్తం ఈ ఉద్యోగులకు సంఘీభావంగా కదిలి ఉద్యమించకపోవడం వల్ల ఉద్యోగులు కొన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నుండి హామీ తీసుకుని మార్చి 5న ఈ సహాయనిరాకరణను ఉపసంహరించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ తెలంగాణ ఉద్యోగులు ఈ నేల తల్లి విముక్తి కొరకు పోరాడుతున్న ‘తెలంగాణ తల్లి ముద్దుబిడ్డలు’గా తమ చరివూతను నమోదు చేసుకున్నారు.

తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేసినామ ని ప్రజలకు భ్రమింప చేసి, అధికార పైళ్ళను ఇంటి నుంచి నడిపించారు. అధిష్ఠానం కన్నెర చేస్తే అధికారం ఎక్కడపోతుందోనని తప్పించుకు తిరుగుతున్నారు అధికార పార్టీనాయకులు. తెలంగాణ ప్రజావూపతినిధులు స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చెప్పే స్థితిలో కూడా లేరు. సామాజిక, ప్రజాస్వామిక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ, తాము నాయకత్వం వహిస్తున్న ఉద్యమ సమస్య పరిష్కారం జరిగే వరకు తెలంగాణ సమస్య పరిష్కారం కావద్దని ‘అస్తిత్వ ఉద్యమకారులు’ వితండ వాదనకు దిగుతున్నారు.

సీమాంధ్ర పెట్టుబడిదారులకు దాసోహమన్న ఈ ఉద్యమకారులు చేసిన దేమిటి? 2010 జనవరి 3న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ‘విద్యార్థి గర్జన’ను పోరాట రూపంగా మార్చకుండా అడ్డుకుని తమ కుటిలత్వాన్ని చాటుకున్నారు. బిల్లు పెట్టేవరకు పోరాడాలన్న వాదనను బలహీనపరిచారు. ఫిబ్రవరి 7న కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యార్థి సభను విచ్ఛిన్నం చేశారు. తద్వారా తెలంగాణ ఉద్యమంలో ‘చోదకశక్తి’గా మారిన విద్యార్థులను కులాల పేరు మీద, వర్గాల పేరు మీద చీల్చారు. తెలంగాణ ఉద్యమంలో చిచ్చు పెట్టి తెలంగాణ ప్రజల వ్యతిరేకులుగా మారిపోయారు. స్పష్టమైన పోరాట కార్యక్షికమాన్ని నిర్వచించుకుని తాము నమ్మిన డిమాండ్ కోసం తుదివరకు పోరాడాలని తమ సంస్థకు పిలుపు నివ్వకుండా, తమ ప్రజాస్వామ్య డిమాండ్ సాధనకు విశాల సమాజ మద్దతును సంపాదించడంలో విఫలమయ్యారు.

నిరంతరం రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ అదే పోరాటమని భ్రమలు పెంచి తమ జాతిని కూడా మోసం చేస్తున్నారు. వర్షకాలం మలేరియా, ఎండకాలం డయేరియాతో మరణిస్తున్న ఆదివాసీగూడాలలోని ప్రజల గూర్చి వీరికి పట్టదు. జిల్లాల్లోనే కృష్ణా పారుతున్నా ఫ్లోరైడ్ నీరు తాగుతూ, దశాబ్దాల తరబడి లక్షలాది ప్రజల జీవితాల్లో వచ్చిన సంక్షోభం వీరికి పట్టదు. హైదరాబాద్ నగరంలో హిందూ- ముస్లింలు భాయి భాయిగా శతాబ్దాల తరబడి జీవించిన అన్ని రకాల ప్రజలు నేడు సీమాంధ్ర వలస వల్ల కనీసం తిండిలేక అలమటిస్తున్నా వీరికి పట్టదు. దళితులు, మైనారిటీల భూములు లాక్కొని సీమాంధ్ర పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసినా వీరికి పట్టదు. తమ అనుకున్నవారికి ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవి ఇస్తేచాలు తెలంగాణ వద్దు అనే స్థితికి వీరు వెళ్ళారు.

అమరత్వానికి కూడా కులాన్ని అంటగట్టి తెలంగాణ తల్లి విముక్తి పోరాటాన్ని అవమాన పరుస్తున్న ప్రస్తుత తరుణంలో మళ్ళీ తెలంగాణ ఉద్యోగులు ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటు’లో పెట్టాలంటూ ఆగస్టులో సకల జనుల సమ్మెకు దిగుతున్నారు. వీరికి మద్దతుగా ఇప్పటికే ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ రంగ సంస్థలకు చెందిన లక్షలాది ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నది. ఎస్మా చట్టం ద్వారా తెలంగాణ ముద్దుబిడ్డల ఆకాంక్షలను అణగదొక్కాలని చూస్తున్నది. ఎస్మా, నాసా, మీసా చట్టాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేవు. అటువంటి చట్టాలు కేంద్ర ప్రభుత్వం అండతో సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుల మీద ప్రయోగించ తలచుకుంటే తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలు సహించరు. మొదట మా మీద మొదట పెట్టండి, ఆ తరువాతనే ఉద్యోగులను తాకండంటూ ప్రజలు ముందుకు కదిలే పరిస్థితి ఏర్పడింది.

ఈ ఉద్యమంలో తెలంగాణ సమాజం కదలక పోతే సీమాంధ్ర పెట్టుబడిదారుల కబంధ హస్తాల చెరనుంచి తెలంగాణ తల్లి విముక్తి జరుగదు. ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా కదిలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుం తెలంగాణ అమరులు కన్న కలలను సాకారం చేసిన వాళ్లం అవుతాం.

-చిక్కుడు ప్రభాకర్

40

CHIKKUDU PRABHAKAR

Published: Thu,October 3, 2013 12:31 AM

సమైక్య వాదులకు మానుకోటలే సమాధానం

వై.ఎస్. జగన్ 2004 దాకా సామాన్య వ్యాపారస్తుడు. తన తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అధికార బలంతో వేలాది కోట్ల రూపాయలు సంపా

Published: Mon,September 16, 2013 12:32 AM

ఏ పునాదుల మీద ఈ సమైక్యాంధ్ర?

గత జూలై 30తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తామని తీర్మానం చేసి దాన్ని కేంద్ర క్యాబినెట్‌కు పంపించింది.

Published: Sat,July 27, 2013 12:51 AM

ఏపీఎన్జీవోల తీరు అప్రజాస్వామికం!

‘మొదట మనం మానవులం. ఆ తర్వాత ఈ దేశ పౌరులం. ఆ తర్వాతనే ఉద్యోగస్తులమని’ ఒక కవి అన్నట్లుగా ఏపీ ఎన్జీవోలు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్

Published: Mon,May 20, 2013 11:52 PM

రాయినిగూడెం నుంచి బోధన్ వరకు

రోశయ్య నుంచి ముఖ్యమంత్రి బాధ్యతలను తీసుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి గత రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా అక్కడి తెలంగా

Published: Mon,April 22, 2013 12:36 AM

రాజకీయాల్లో విలువలు ఏవీ?

ఇటీవలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 వ జయింతిని కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిపారు. రాష్ర్టంలో కూడా ముఖ్యమంత్రి, ఉప

Published: Fri,April 5, 2013 11:38 PM

నాటి ఆజంజాహీ మిల్లు నేడేదీ?

ఆఖరి నిజాం నవాబైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1934లో వరంగల్ నగర తూర్పు ప్రాంతంలో ఆజంజాహీ మిల్లును స్థాపించారు. నాడు వరంగల్, ఖమ్మం, కరీంన

Published: Tue,March 26, 2013 12:06 AM

సీమాంధ్ర దురహంకారం

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్న మాటలు తెలంగాణ ప్రజల మనస్సులను తీవ్రంగా గాయపరిచాయి. 2008 నుంచి న

Published: Sun,February 10, 2013 11:48 PM

సింగరేణి డిస్మిస్‌డ్ కార్మికుల వెతలు

ఉత్తర తెలంగాణలోని గోదావరినది పరివాహక ప్రాంతంలో 1886లో బయటపడ్డ బొగ్గు నిక్షేపాలను బయటికి తీసి ప్రపంచానికే వెలుతురు నిచ్చిన సింగరేణి

Published: Mon,December 17, 2012 01:44 AM

సీమాంధ్ర సీఎంలంతా ఒక్కటే

ఈమధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణంలో పర్యటిస్తూ ‘నేను తెలంగాణలో పుట్టిపెరిగిన వాడిని, నేను తెలంగాణ వాడినే’ అంటూ మాట

Published: Sat,December 8, 2012 12:17 AM

ఉపాధిని మింగుతున్న ఉత్పత్తి

సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కంపెనీ ఓపెన్‌కాస్ట్‌లతో రోజు రోజుకు ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదిపజల జీవితాలను ఛిద్రం

Published: Thu,December 13, 2012 04:17 PM

దారితప్పిన చైనా కమ్యూనిస్టు పార్టీ

నవంబర్ 8వ తేదీనుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ బీజింగ్‌లో జరిగింది. ఈ కాంగ్రెస్‌లో 2270మంది ప్రతినిధులు పాల్గొనగా

Published: Fri,December 7, 2012 03:12 PM

అన్నీ దోపిడీ యాత్రలే!

ప్రజాస్వామ్య పాలన పేరిట అటు చంద్రబాబు, ఇటు వైఎస్‌ఆర్ ఇద్దరూ ప్రజాకంటక పాలన సాగించారు. దోపిడీదారులకూ, భూస్వాములకూ, పెట్టుబడిదారులకూ

Published: Fri,December 7, 2012 03:11 PM

కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు

దేశం నేడు అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాలన నుంచి నేటి ప్రధాని మన్మోహన్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయ

Published: Fri,December 7, 2012 03:08 PM

రిటైల్ రంగంలో ‘ప్రత్యక్ష’ దోపిడీ

దేశీయ రిటైల్ రంగాన్ని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. 51 శాతం మల్టి బ్రాండ్‌లో, సింగిల్ బ్రాండ్

Published: Thu,December 13, 2012 04:21 PM

అన్ని రంగాలకూ సమ్మే విస్తరణ

సైరన్ మోగిందిరా, సకల జనుల సమ్మెలో పాల్గొనాలిరా అంటూ తెలంగాణ ముద్దుబిడ్డలైన నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగులు 13వ తేదీ నుంచి కదిలారు.

Featured Articles