ప్రజాస్వామ్య ఉద్యమం పట్టదా?


Sat,October 6, 2012 02:40 PM

cpi talangana patrika telangana culture telangana politics telangana cinemaఏరాజకీయ పార్టీ అయినా ప్రజల అభీష్టాన్ని గుర్తించి ముందుకు సాగాలి. అప్పుడే ఆ పార్టీ ప్రజల్లోకి దూసుకుపోగలుగుతుంది. ప్రధానంగా ఉద్యమాలతో ప్రజల ముందుకొచ్చిన పార్టీలు ప్రజల ఆకాంక్షలను గౌరవించడం మరీ ముఖ్యం. ఇలా ప్రతీ అడుగు ఆచితూచి వేస్తున్నందువల్లే కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటి కీ ప్రజల్లో మనుగడ సాగించగలుగుతున్నాయి. సొంత భాషను కాపాడుకోవడానికి జరిగిన భాషోద్యమం, గ్రంథాలయ , ఆంధ్ర మహాసభల ఉద్యమాలు, దొరల పెత్తనా న్ని ఎదిరిస్తూ వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం వంటివి కమ్యూనిస్టులకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. ఇప్పటికీ ఎంతో గొప్పగా చెప్పుకునే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టుల కీర్తికిరీటంలో నిలిచింది. కమ్యూనిస్టులు ఉద్యమ స్వరూపాన్ని చాటుకుంది తెలంగాణ కేంద్రంగానే కావడం గమనార్హం. ఈ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించి పేదల పక్షాన ఉద్యమాన్ని సల్పింది. వేల సంవత్సరాల ఫ్యూడల్ వ్యవస్థను మట్టి కరిపించి ప్రజారాజ్యాన్ని స్థాపించి 10 లక్షల ఎకరాలను పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టులకు దక్కింది. ఐదేళ్లపాటు జరిగిన సాయుధ పోరాట హోరులో నెహ్రూ ,ప చేతిలో నాలుగు వేల మంది కమ్యూనిస్టు లు చంపివేయబడ్డారు. వేలాది గ్రామాలకు చెందిన లక్షల మంది ప్రజలపై పోలీసు దాడులు, మిలటరీ దాడులు జరిగాయి. జనం క్రూరమైన పోలీసు నిర్బంధానికి గురయ్యారు. ఈ పోరుతో విజయం సాధించి జాగీర్దారులు, జమీందార్ల మెడలు వంచి భూస్వామ్య పాలనను అంతమొందించారు.

ఈ పోరు ప్రపంచ చరివూతలో చిరస్థాయిగా నిలిచిపోవడమేగాక ఆనాటి సోషలిస్టు సోవియట్ నేత స్టాలిన్ ప్రశంసలందుకుంది. ఇది కమ్యూనిస్టులు ఎలుగెత్తి చెప్పుకోగల విజయం. ఈ ఉద్యమానికి కొనసాగింపుగానే కార్మికులు, కర్షకులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై కమ్యూనిస్టులు ప్రత్యేకంగా దృష్టిసారించడం మొదలుపెట్టి మరింత పట్టుకోసం ప్రయత్నించారు. సమాజంలో వేళ్లూనుకున్న వివక్ష, అన్యాయపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడటం మొదలు పెట్టారు. అయితే దేశ చరివూతలో నిలిచిపోయిన ఈ ఉద్యమం ముగిసిన అనంతరం అంటే 1952లో కమ్యూనిస్టుల్లో విభేదాలు పొడచూపాయి. అతివాద, మితవాదులుగా కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. ఆ తర్వా త 1964లో అతివాదులంతా కలిసి సీపీఎం, మితవాదులు సీపీఐగా కొత్త పార్టీని ఆవిషృ్కతం చేశారు. సీపీ ఎం పార్టీ పశ్చిమ బెంగాల్‌లో అక్కడి కాంగ్రెస్8తో పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీ ప్రాంతంలో ఓ ఉద్య మం చెలరేగింది. అక్కడి జోతేదార్లకు (భూ స్వాములు) వ్యతిరేకంగా ఉద్యమం పుట్టుకొచ్చింది. భూస్వామ్య పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమం లో సంతాల్‌లు(రైతులు) తిరగబడి వారి భూమిని వారు దక్కించుకున్నారు.

కాగా ఈ ఉద్యమాన్ని అణచడానికి సీపీఎం ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఈ సందర్భంలో ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పుల్లో చాలా మంది రైతులు అసువులు బాసారు. సీపీఎం నేత, మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు అప్పట్లో హోంమంవూతిగా కొనసాగుతున్నారు. అయితే భూస్వామ్య విధానానికి కొమ్ముకాస్తూ సాగించిన కాల్పుల్లో రైతులు చనిపోవడంతో ప్రభుత్వంపై రైతుల వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చింది. కమ్యూనిస్టుల విభజన సమయంలో సీపీఎం ఎంచుకున్న విధానాలకు భిన్నంగా వ్యవహరించడంతో జనంలో పార్టీ బాగా పలుచనైంది. ఈ క్రమంలో కొందరు విప్లవకారులు సైతం పార్టీని వీడి బయటికొచ్చారు. సీపీఎం నుంచి విడిపోయిన విప్లవకారులే 1969 ఏప్రిల్ 22వ తేదీన సీపీఐ(ఎంఎల్) పార్టీకి పురుడుపోశారు. దీంతో తొలుత ఐక్యంగా ఉన్న కమ్యూనిస్టుల నుంచి ఏర్పడిన ఒక దశ చీలిక రెండో దశకు చేరుకుంది. అయితే సాయుధ రైతాంగ పోరాటంలో సాధించిన విజయం నిరంతరం ప్రజల పక్షాన ఉండటంతో కమ్యూనిస్టులకు తెలంగాణలో ఇప్పటికీ పట్టును నిలుపుతూ వస్తోంది.

1946వ సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావం తెరపైకొచ్చింది. ఆ సమయంలో భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు కమ్యూనిస్టులు మద్దతు పలికారు. ఈ దశలో ఉద్యమించారు కూడా. ఈక్రమంలో 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. తిరిగి 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రతో కలిపి ఆంధ్రవూపదేశ్‌గా ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేసే సమయంలో పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాలను అమలుచేసి ఉంటే తెలంగాణ ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తమయ్యేది కాదు. క్రమేణా ఈ ఒప్పందాలను ఉల్లంఘించడంతో వలసపాలనలో అణగదొక్కబడుతున్నామనే భావన కలిగింది. గోదావరి జలాలు తెలంగాణలో పారుతున్నా సమువూదంపాలవుతున్నాయేగానీ ఇక్కడ ఒక్క ఎకరాకు కూడా నీరు దక్కనీయలేదు. కృష్ణా జలాలు సైతం 70 శాతానికిపైగా ఆంధ్రా ప్రాంతానికే తరలించుకుపోయారు. సిరులు అందించే బొగ్గు గనులున్నా ఒక్క విద్యుత్ పరిక్షిశమను కూడా నెలకొల్పిన దాఖలాల్లేవు. ఫలితంగా పారిక్షిశామిక, ఉద్యోగ, విద్యారంగాల్లో పురోగతి శూన్యంగా మారింది. దీంతో 1969 నాటికి తెలంగాణలో నిరుద్యోగం బాగా పెరిగిపోయి జిల్లాలన్నీ జీర్ణదశకు చేరుకున్నాయి. కోస్తాంధ్ర నుంచి వచ్చిన వలసవాదులే ఇక్కడికి వచ్చి ఉద్యోగాల్లో పాతుకుపోయారు. ఫలితంగా ఈ దుస్థితిని జీర్ణించుకోలేక కడుపు మండిన తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు ఉద్యమబాట పట్టారు. దీంతో 1969లో తొలి విడత తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఉవ్వెత్తున సాగిన ఈ ఉద్యమంలో 369 మంది అసువులు బాసారు.

ఉద్యోగాలన్నీ సీమాంవూధవాసులే అనుభవిస్తున్నారన్న ఆందోళన చాలా కాలం కొనసాగింది. దీంతో 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 610 జీవో అమల్లోకి తెచ్చారు. దీనిపై విచారణ జరిపేందుకు జస్టిస్8 జయభారత్ రెడ్డి కమిషన్‌ను వేయగా 56 వేల ఉద్యోగాలు సీమాంవూధుల చేతిలో ఉన్నాయని నిర్ధారించారు. ఈ కమిషన్ సూచనల మేరకు తెలంగాణలోని సీమాంధ్ర ఉద్యోగులను అక్కడికే పంపి ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఇక్కడి ఖాళీలను తెలంగాణ నిరుద్యోగులతో నింపాల్సి ఉంది. ఆ నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కంటితుడుపుగా తెచ్చిన జీవోను అమలు చేయడంలో విఫలమవ్వడమేగాక సీమాంవూధులకు వత్తాసు పలికారనే అపవాదును మూటగట్టుకున్నారు. కాగా 610 జీవోపై సీమాంవూధులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి అక్కడ చుక్కెదురైంది. అయినా తెలంగాణలోకి వలసల పరంపర అలాగే కొనసాగడంతో తెలంగాణలో వారి మరింత పెత్తనం పెరిగింది. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపిందీలేదు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలోని బీపీఎల్ పరిక్షిశమను నెలకొల్పే పేరుతో 1/70 చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనుల భూములను అప్పనంగా లాగేసుకున్నారు. పరిక్షిశమలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా 80 శాతానికిపైగా సీమాంవూధులతోనే భర్తీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి వివక్షాపూరిత పరిణామాలే చోటుచేసుకోవడంతో కడుపు మండుతున్న ఈ ప్రాంత ప్రజలు విభజనను కోరుకుంటున్నారు.


తాడిత పీడిత ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నామని చెబుతున్న మార్క్సిస్టులకు తెలంగాణ ప్రజల విషయంలో అనాదిగా జరుగుతున్న వివక్ష కనిపించడంలేదా? పెత్తందారీ విధానం, పరుల పెత్తనంపై పోరాడే సీపీఎం తెలంగాణ విషయంలో వెన్ను చూపడమే విద్రోహ నిర్ణయం. నాలుగున్నర కోట్ల మంది ప్రజలు గొంతెత్తి తెలంగాణ కావాలని అడుగుతు న్నా ఉలుకూపలుకూ లేకుండా సమైక్యరాగం తీయడం ఎంత వరకు సమంజసం.? ఎప్పుడో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలంగా చేసిన తీర్మానానికే కట్టుబడి ఉన్నామని చెప్పడం తెలంగాణ ప్రజల ఆకాంక్షను విస్మరించినట్లు కాదా? నిజంగా ప్రజల పక్షాన పోరాడే పార్టీనే అయితే కోట్ల ప్రజానీకం ఆకాంక్షను గౌరవించాలి. న్యాయమైన ఈ ఉద్యమం వైపు మొగ్గు చూపకపోవడం వెనుక కారణాలేంటి? తెలంగాణ ఉద్య మం సరైందేనని నిశ్చయించుకున్న సీపీఐ, న్యూడెమోక్షికసీ, మావోయిస్టు పార్టీలు సైతం సమైక్య రాగాన్ని వదులుకుని నాలుగున్న ర కోట్ల ప్రజానీకాన్ని బలపరుస్తూ ఉద్యమంలోకి దిగా యి. మరి తోటి ఉద్యమ పార్టీ అయిన సీపీఎం సమైక్యవాదాన్ని వినిపించడంలో ఆంతర్యమేమిటో అంతుచిక్క ని విషయం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తేల్చాల్సిందేనంటూ ప్రకటనలు చేస్తున్న సీపీఎం పార్టీ అగ్రనేతలు.. తేల్చాల్సింది ఏమిటో సెలవీయడంలేదు. వీరి వైఖరిని బట్టి చూస్తుంటే తెలంగాణను ఇచ్చేదిలేదని తేల్చిచెప్పమంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఏమూలన ఎలాంటి వివక్ష చోటుచేసుకున్నా మేమున్నామంటూ ఉద్యమాలకు దిగే సీపీఎంకు ప్రజాస్వామ్యయుత తెలంగాణ ఉద్యమం ఎందుకు కనిపించడం లేదో ఆ పార్టీ బహిరంగ పరచాల్సిన అంశం. అయితే దేశ ప్రజలకు ప్రధాన శత్రువు కాంగ్రెస్సేనని చెబుతున్న ఆ పార్టీ 2004 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్8తో కలిసి పొత్తుల పరంపరను ఎలా కొనసాగించిందో చెప్పాలి.

2009 ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, టీఆర్‌ఎస్ లతో కూడిన మహా కూటమిలో జత కట్టిన తీరుపైనా ఆ పార్టీ నేతలు స్పందించాలి. 1991లో పి.వి.నర్సింహారావు ప్రభుత్వం మైనారిటీలో పడినప్పుడు బలపరిచిందీ సీపీఎమ్మే. నూతన ఆర్థిక విధానాలను అమలు పరిచి దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసిన మన్మోహన్ సింగ్‌కు మద్దతిచ్చి కాంగ్రెస్8 సర్కారు అండనిచ్చిందీ సీపీఎమ్మే. ఓట్లు, సీట్ల కోసం ఎప్పటికప్పుడు విధానాలు మార్చుకుంటున్న సీపీఎం తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఎందుకు బలపరచలేకపోతోందో సమాధానం చెప్పాలి. తాజాగా సీపీఎం పార్టీ రాష్ట్ర మహాసభలను ఖమ్మంలో జరుపుతోంది. మూడురోజుల పాటు జరిగే ఈ సభల్లో తెలంగాణపై చర్చ జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజా ఉద్యమాలను గౌరవించే సీపీఎం తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచే తీరిలో స్పష్టమైన ప్రకటన చేస్తేనే మార్క్సిస్టుల భవిత భద్రంగా ఉంటుంది.

-ఆకుతోట ఆదినారాయణ

35

AKUTOTA ADINARAYANA

Published: Sat,October 6, 2012 02:39 PM

ఉద్యమ పార్టీపై ఉపేక్ష వద్దు..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా, ఉద్యమంలో భాగస్వామ్యం వహిస్తున్న పార్టీల తీరుతెన్నులను పరిశీలిస్తే, ఒక్కో పార్టీ సిద

Published: Sat,October 6, 2012 02:44 PM

ఆకాంక్షను ఎత్తుకున్న కామ్రేడ్స్

పోరాటాలు, ఉద్యమాలు కమ్యూనిస్టులకు కొత్తేమీ కావు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో చరివూతాత్మక పోరాటా లు, త్యాగాలు చేస

Published: Sat,October 6, 2012 02:42 PM

సిద్ధాంతాలు రైట్... సమస్యలు లెఫ్ట్

ఉద్యమం అంటే సమష్టి కష్టం, త్యాగం. అప్పుడే దాని ఫలితాలు ఆశించిన మేరకు, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటాయి. అమెరికా సామ్రాజ్యవాదంపైనా

Published: Sat,October 6, 2012 02:44 PM

అవే అబద్ధాలు!

ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం గౌరవించడం లేదు. ఈ నేపథ్యంలో

Featured Articles