ఉద్యమ పార్టీపై ఉపేక్ష వద్దు..


Sat,October 6, 2012 02:39 PM

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా, ఉద్యమంలో భాగస్వామ్యం వహిస్తున్న పార్టీల తీరుతెన్నులను పరిశీలిస్తే, ఒక్కో పార్టీ సిద్ధాంతాలు, వాటి మూలాలు, అసలు లక్ష్యాలు, నేపథ్యం వేర్వేరుగా ఉన్నా యి. కానీ, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టింది, ఉద్యమానికి జవసత్వాలిచ్చేది.. రాష్ట్రం వచ్చే దాక ఒకే ఎజెండాతో పనిచేసేది ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే. ఉద్యమం వెంట ఎన్ని పార్టీలు, ఫ్రంట్‌లు వచ్చినా అవన్నీ టీఆర్‌ఎస్ తర్వాతనే అనేది మలిదశ పోరాట దశలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌తోపాటు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న సీపీఐ,నక్సలైట్ పార్టీల ఆవిర్భావం, మూలసిద్ధాంతం వేరు. కార్ల్‌మార్క్స్‌ధొనిన్, మావో సిద్ధాంతాలతో సామ్యవా దం, శ్రామికరాజ్య లక్ష్యాలతో సీపీఐ, ఎంఎల్ పార్టీలు పనిచేస్తున్నాయి. ఆ సిద్ధాంతాల పునాదులపైనే ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నాయి.ఒకప్పుడు ఈరెండు కూడా సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నవే. తెలంగాణ ప్రజల మనోభావాలకు తలొగ్గి, టీఆర్‌ఎస్ చేస్తున్న ఉద్యమ ప్రభావానికిలోనై అవి కూడా తెలంగాణకు జై కొట్టాల్సినా అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇక జాతీయ పార్టీ అయిన బీజేపీ ఎన్డీయే కాలంలో చంద్రబాబుతో అంటకాగి తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టింది. ప్రత్యేక రాష్ట్ర అనివార్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈపార్టీ కూడా తెలంగాణకు జై కొట్టి ఉద్యమంలో చేరింది.

ఉద్యమంలో భాగస్వామ్యమే కానీ, ఇవి ప్రత్యేకంగా కార్యాచరణ, ఆందోళన కార్యక్షికమాలు చేపట్టలేదు. టీఆర్‌ఎస్ స్ఫూర్తితోనే వివిధ పార్టీ ల మద్దతుతో జేఏసీ ఏర్పడింది. ఈరెండు కలిసి కార్యాచరణ పథకాన్ని రూపకల్పన చేసి చురుకైన పాత్ర వహించడం, మిగిలిన కలిసొచ్చే పార్టీలు, సంఘాలు, సంస్థలు, ఫ్రంట్‌లు ఆ కార్యాచరణ, ఆందోళనలో భాగస్వామ్యం అవుతున్నారు. తెలంగాణ ద్రోహులుగా మిగిలిన టీడీపీ, కాంగ్రెస్‌లలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు కొంద రు ఉనికి, పదవులు, మనుగడ కోసం తెలంగాణకు జై కొడుతున్నప్పటికీ, వారి చర్యల్లో చిత్తశుద్ధి కొరవడింది. తెలంగాణ కోసం సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు నటిస్తున్న సోకాల్డ్ పార్టీల తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధులు ప్రత్యేక రాష్ట్రం కోసం తమ పదవులకు రాజీనామాలు చేయలేదం తెలంగాణ పట్ల వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతోంది. ఈవిషయం లో ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే క్లీన్‌చిట్‌గా నాలుగున్నరకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమైంది. లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కలిసొచ్చే పార్టీలను, నాయకులను కలుపుకుని ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకుపోవడంలో ఆపార్టీ చేస్తున్న అవిరళ కృషిని తెలంగాణ వాదులు వేనోళ్ల ప్రశంసిస్తున్నారు.

కేసీఆర్ తెలంగాణ కోసం పనిచేసే ఉద్యమ శక్తులన్నింటికీ ఒక చోదకశక్తిగా ఉన్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఆయనది. తెలంగాణకు చుక్కాని ఆయన. తెలంగాణ ఆకాంక్షల సాఫల్యం కోసం, ఒక రాజకీయ పార్టీ ఏర్పడటం రాజకీయ చరివూతలోనే మైలురాయి. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా వెన్ను చూపకుండా, వెరవకుండా ముందుకుసాగే ఒకే ఒక్క పార్టీగా. ఉద్యమానికి మూల స్తంభంగా టీఆర్‌ఎస్ ఉంది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో రాష్ట్రం అగ్నిగుండంగా మారడం, బలిదానాలు పెరగడంతో యూపీ ఏ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క తెలంగాణ అంశంతోనే తలొగ్గే విధంగా చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుంది. దీనికి ఫలితంగా 2009 డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన చేయడమే కాకుండా, కేంద్ర మంత్రు లు చిదంబరం, ప్రణబ్‌లు డిసెంబర్ 10న ఉభయ సభల్లో తెలంగాణ ఇస్తామని చెప్పారు. ఈవిషయమై మాట నిలబెట్టుకోకపోవడం, సీమాంధ్ర నాయకులు, తెలంగాణ ద్రోహులు, టీడీపీ, కాంగ్రెస్‌ల కుట్ర ఫలితంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను నెరవేర్చకపోవడమనేది రాజకీయ కుట్రలు,కుతంవూతాలకు చెందిన విషయమది. కానీ టీఆర్‌ఎస్ తెలంగాణ సాధన విషయంలో అనుకూల ప్రకట న చేయించి, ఒక మెట్టు విజయం సాధించిన ఏకైక రాజకీయ పార్టీగా చెప్పవ చ్చు.2010లో జేఏసీ పిలుపునిస్తే తిరిగి పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తిరిగి వారే ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడం వెనుక తెలంగాణవాదానికి టీఆర్‌ఎస్ ఎంత పునాది వేసిందనేది తేటతెల్లమవుతోంది. ఇక్కడ జేఏసీకి టీఆర్‌ఎస్‌కు ఉన్న పరస్పర అవినా భా చైతన్య సంబంధాన్ని కూడా చాటి చెబుతుంది.

2009లో ఎమ్మెల్యేల బలం పది నుంచి 16కు పెరగడంతో, తెలంగాణవాదాన్ని టీఆర్‌ఎస్ మాత్రమే బలంగా చాటగలదని నిరూపించింది. పార్లమెంట్‌లో కేసీఆర్ స్పీకర్ మీరా కుమారి ప్రసంగాన్ని అడ్డుకుని బడ్జెట్ ప్రతులను చించడం, పార్లమెంట్ ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగంతో పాటు, యూపీఏ ప్రభుత్వ కనీస ఉమ్మడి కార్యక్షికమం లో తెలంగాణ అంశాన్ని పెట్టించడం, తెలంగాణకు మద్దతుగా 36 జాతీయ పార్టీల లేఖలను సేకరించ డం టీఆర్‌ఎస్ సాధించిన విజయాలే.ఉద్యోగ, రాజకీయ జేఏసీలతో కలుపుకుని కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి తెలంగాణ ఆవశ్యకతను చాటి చెప్పడం లాంటి వి జేఏసీ, టీఆర్‌ఎస్‌కు గల అవినాభావ సంబంధాన్ని ప్రస్ఫుటిస్తోంది. ఇదంతా ఒక్క ఎత్తయితే ప్రపంచస్థాయిలో మునుపెన్నడు లేనివిధంగా జేఏసీ పిలుపుమేరకు సకల జనుల సమ్మెను తెలంగాణ సమాజం అంతటా చేపట్టి చారివూతాత్మకం చేసింది. ఉద్యోగ, కార్మిక, కర్షక, వ్యాపార అన్ని వర్గాలకు చెందిన వారు ఈసమ్మెలో పాల్గొని తెలంగాణ వాదా న్ని, మనోభావాన్ని, ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు.


తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్‌తో ఇంతగా ముడిపడి ఉన్న జేఏసీ పరకాల ఉప ఎన్నిక విషయంలో డోలాయమానం వహించడం సరైంది కా దు.ఈఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలి. సీపీఎం మినహా మిగిలిన వామ పక్ష పార్టీలు, బీజేపీలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పటికి అవి ప్రజల ఉద్యమ సెగకు మాత్రమే తలవంచాయి తప్ప ప్రత్యేకం గాఉద్యమాన్ని భుజాన వేసుకొని నడిపింది లేదు. నేడు కాంగ్రెస్, తెలుగుదేశంలోని తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధులు కేవలం తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతామనే భావంతోనే అప్పుడప్పుడు ఉద్యమ రూపంలో కన్పించకుండా కేవలం ప్రెస్‌మీట్లతో కాలం వెల్లబుచ్చుతున్నారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతు ఇంకా ఈ ప్రాంత తెలుగుదేశం ప్రజావూపతినిధులు ఉద్యమకారులు ఉద్య మ పార్టీలపై అవాకులు, చవాకులు పేలుతున్నారు.వీరి చర్యల ను ఈ ప్రాంత ప్రజలు ఛీ కొడుతున్నారు. సోనియా, చంద్రబాబుల జపాలతో ప్రజలకు మొఖం చూయించుకోలేని పరిస్థితి వీరికి దగ్గరలోనే ఉంది. ఇలాంటి శక్తులు కూడా రానున్న ఎన్నికల్లో మేము కూడా తెలంగాణకు అనుకూలమే కనుక మేము కూడా పోటీ చేస్తాం.. మాకు మద్దతు ఇవ్వండి అని అడిగే ప్రమాదం కూడా ఉంది. తెలంగాణ కోసం తెగించి పోరాడుతున్నది ఎవరూ... కష్టాల్... నష్టాల్... భరిస్తున్నది ఎవరూ... త్యాగాలు చేస్తున్నది ఎవరూ... భవిష్యత్‌లో ఉద్యమాన్ని మరింత ఉధృత రూపంలోకి తీసుకెళ్లి తెలంగాణ సాధనే లక్ష్యంగా పోరాడే వారికే జేఏసీ పరకాలలో మద్దతివ్వాలి. మహబూబ్‌నగర్‌లో జేఏసీ చేసిన పొరపాటు వలన అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పరకాలలో ఆ పరిస్థితి ఎదురవ్వకుండా చూడాలి. తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని ఎలుగెత్తి చాటాలి.

-ఆకుతోట ఆదినారాయణ

35

AKUTOTA ADINARAYANA

Published: Sat,October 6, 2012 02:44 PM

ఆకాంక్షను ఎత్తుకున్న కామ్రేడ్స్

పోరాటాలు, ఉద్యమాలు కమ్యూనిస్టులకు కొత్తేమీ కావు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో చరివూతాత్మక పోరాటా లు, త్యాగాలు చేస

Published: Sat,October 6, 2012 02:42 PM

సిద్ధాంతాలు రైట్... సమస్యలు లెఫ్ట్

ఉద్యమం అంటే సమష్టి కష్టం, త్యాగం. అప్పుడే దాని ఫలితాలు ఆశించిన మేరకు, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటాయి. అమెరికా సామ్రాజ్యవాదంపైనా

Published: Sat,October 6, 2012 02:40 PM

ప్రజాస్వామ్య ఉద్యమం పట్టదా?

ఏరాజకీయ పార్టీ అయినా ప్రజల అభీష్టాన్ని గుర్తించి ముందుకు సాగాలి. అప్పుడే ఆ పార్టీ ప్రజల్లోకి దూసుకుపోగలుగుతుంది. ప్రధానంగా ఉద్యమా

Published: Sat,October 6, 2012 02:44 PM

అవే అబద్ధాలు!

ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం గౌరవించడం లేదు. ఈ నేపథ్యంలో