Thangalaan Movie | కోలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకుల ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో తంగలాన్ ఒకటి. తమిళ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ‘కబాలి’, ‘కాలా’, ‘సర్పట్ట పరంపర’ చిత్రాల ఫేమ్ పా రంజిత్ (Pa Ranjith) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
ఇక ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను మొదట జనవరి 26 విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వలన వాయిదా పడింది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ అప్పుడు కూడా ఈ సినిమాకు కలిసి రాలేదు. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీపై ఒక సాలిడ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మూవీని ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆగష్టు 15 రేసులో ఉన్న పుష్ప 2 డిసెంబర్‌కు వాయిదా పడగా.. ఆ స్థానంలో రామ్- పూరీ కాంబోలో వస్తున్న డబల్ ఇస్మార్ట్ వస్తుంది. ఇక ఆగష్టు 15 కి తంగలాన్ కూడా వస్తే బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. ‘సర్పట్ట పరంపర’ ఫేమ్ పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
#Vikram – #Thangalaan – AUG 15th Release 🥵🥵🔥🔥🔥 pic.twitter.com/wF6jFh1RcW
— GetsCinema (@GetsCinema) June 30, 2024
ఇవి కూడా చదవండి..