Vicky Kaushal | ‘గుడ్ న్యూస్ నిజమేనా? అనడిగితే.. ముందు ‘బ్యాడ్‌న్యూస్’ ఎంజాయ్ చేయండి.. అంటున్నారు బాలీవుడ్ స్టార్హీరో విక్కీకౌశల్. ఆయన కథానాయకుడిగా, త్రిప్తి డిమ్రీ కథానాయికగా రూపొందిన ‘బ్యాడ్‌న్యూస్’ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా విరివిగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు విక్కీకౌశల్. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కత్రినా ప్రెగ్నెంట్ అనే వార్తపై ఆయన స్పందిస్తూ.. ‘నిజంగా అలాంటి గుడ్‌న్యూస్ ఏదైనా ఉంటే, సంతోషంగా మీ అందరితో పంచుకోకుండా ఉంటామా?!.. ఆ వార్తల్లో నిజం లేదు.
ప్రస్తుతానికి ‘బ్యాడ్‌న్యూస్’ ఎంజాయ్ చేయండి. సమయం వచ్చినప్పుడు ఆ ‘గుడ్‌న్యూస్’ ఎంజాయ్ చేద్దురుగానీ..’ అంటూ నవ్వుతూ చెప్పారు విక్కీ కౌశల్. ఈ సినిమాలోని ‘తౌబా తౌబా’ పాట విడుదలై మంచి ఆదరణ పొందుతున్నది. ఈ పాట గురించి మాట్లాడుతూ ‘నాకు డ్యాన్స్ రాదు. కానీ మా యూనిట్ నాకు డ్యాన్స్ నేర్పించారు. ఈ పాటకోసం చాలా కష్టపడ్డాం. ప్రేక్షకులు శ్రమకు తగ్గ ఫలితం ఇస్తారనుకుంటున్నా.’ అని అన్నారు విక్కీ.