వరుణ్‌సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ ఉపశీర్షిక. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రాజేష్ జగన్నాథం రూపొందిస్తున్నారు. శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో వరుణ్‌సందేశ్ అమాయకంగా కనిపిస్తున్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కాండ్రకోట అనే ప్రదేశంలో చోటుచేసుకునే అనూహ్య సంఘటనలు, వాటివెనకున్న శక్తుల రహస్యాలు ఆద్యంతం ఉత్కంఠను పంచుతాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 15న టీజర్‌ను విడుదల చేయబోతున్నాం’ అన్నారు. అనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రమీజ్ నవీత్, సంగీతం: సంతు ఓంకార్, రచన-దర్శకత్వం: రాజేష్ జగన్నాథం.