Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే రాబోతుంది. ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రభాస్ అండ్ నాగ్ అశ్విన్ టీం ఏదో ఒక అప్డేట్తో అందరినీ ఖుషీ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోంది.
కల్కి 2898 ఏడీ ప్రమోషన్లో భాగంగా The Prelude of Kalki2898AD పేరుతో ఎపిసోడ్ 1 ను విడుదల చేశారు మేకర్స్. ఈ కథ అన్నింటికీ క్లైమాక్స్. మన కలియుగంలో ఏం జరుగబోతుంది. ఎలా జరుగొచ్చు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ఈ కథతో అనుబంధం కలిగిఉంటారంటూ కల్కి Kalki2898AD ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ సాగుతున్న నాగ్ అశ్విన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన బుజ్జి, భైరవ విజువల్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ భైరవ (Bhairava) పాత్రలో కనిపించనుండగా.. అతడి దోస్త్ బుజ్జి (Bujji)గా స్పెషల్ కారు సందడి చేయనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్ కాగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ టైటిల్, గ్లింప్స్ వీడియో, టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
An epic journey into the future with Director @nagashwin7…
Presenting Episode 1 – The Prelude of #Kalki2898AD.#Kalki2898ADonJune27 pic.twitter.com/GLRFby6kNJ— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 18, 2024