Samantha | ఓ వైపు సినిమాలు చేస్తూ, మరో వైపు ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ ఇస్తున్నది అగ్ర కథానాయిక సమంత. తన ఫిట్నెస్ ట్రైనర్ అల్కేష్ షరోత్రితో కలిసి ‘టేక్ 20’ పేరుతో ఇన్‌స్టా వేదికగా ఆరోగ్య సూత్రాలను వల్లెవేస్తున్నది ఈ అందాలభామ. ఇందులో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నది. ఇదిలావుంటే.. సమంత టిప్స్‌పై ఓ నెటిజన్ క్వశ్చన్ చేశాడు. ‘ఇప్పుడీ సూక్తులు చెబుతున్నారు బాగానే వుంది. గతంలో మీరు అనారోగ్యమైన బ్రాండ్లను ప్రమోట్ చేశారు. దానికేం సమాధానం చెబుతారు?’ అని అడిగాడు.
దాంతో కంగు తినడం సామ్ వంతైంది. వెంటనే తను రియాక్టవుతూ ‘గతంలో తప్పులు చేసిన మాట నిజమే. అవి తెలియక చేసిన తప్పులు. తెలుసుకున్న తర్వాత అలాంటి వాటిని ప్రమోట్ చేయడం పూర్తిగా ఆపేశాను. ప్రస్తుతం ఏవైతే ఆచరిస్తున్నానో.. వాటిని మాత్రమే చెబుతున్నాను’ అని తెలిపారు. ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థలో ‘మా బంగారం’ అనే సినిమాను రూపొందిస్తున్నది సమంత.