Sushmita Sen | బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తన రిలేషన్షిప్ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను కొన్నేళ్ల నుంచి సింగిల్‌గానే ఉంటున్నట్లు ఎటువంటి రిలేషన్లో లేనట్లు మాజీ విశ్వ సుందరి వెల్లడించింది. ప్రస్తుతానికి నా జీవితంలో ఎవరు లేరని తెలిపిన ఈ అమ్మడు మూడేళ్ల నుంచి సింగిల్‌గానే ఉంటున్నట్లు తెలిపింది. ఒకనోక సమయంలో ఐదేళ్ల పాటు ఒకరితో ప్రేమలో ఉన్నా. అతడు దూరం అయ్యాక మళ్లీ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలని అనుకోలేదు. ఈ వయసులో హార్ట్‌బ్రేక్స్ నా శరీరానికి మంచింది కాదు. అందుకే లవ్‌కి దూరంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నా అంటూ సుస్మితా సేన్ వెల్లడించింది.
మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు గత ఏడాది ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇద్దరూ ఇంటిమేట్‌గా ఉన్న ఫోటోలను గతంలో లలిత్ మోదీ షేర్ చేస్తూ డేటింగ్ ప్రకటన చేయగా.. ఆ తర్వాత అనుకోకుండా వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం. మరోవైపు త్వరలో సుస్మితా సేన్ పెళ్లి చేసుకోబోనున్నట్లు చెప్పిన లలిత్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తలేదు.
Also read..