సౌతిండియన్ స్టార్ సూర్య నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. దిశా పటాని కథానాయిక. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను నైజాంలో విడుదల చేయనుంది.
ఇప్పటివరకూ తెరపై రాని కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, భారతీయ సినీ పరిశ్రమలో వస్తున్న మరో భారీ సినిమా ఇదని, మొత్తం పది భాషల్లో సినిమా విడుదల కానుందని నిర్మాతలు తెలిపారు. బాబీ డియోల్, యోగి బాబు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెట్రి పళనిస్వామి, మాటలు: మదన్ కార్కే, కథ: శివ, ఆదినారాయణ.