Coolie | తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తలైవ కెరీర్లో ఇది 171వ సినిమా. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ నెలలో షూటింగ్ ప్రారభించిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ మూవీలో విలన్ పాత్రకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
ఈ మూవీలో తలైవర్‌ను ఢీ కొట్టే పాత్రలో టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ ఇదే నిజమైతే అటు రజినీ ఫ్యాన్స్‌తో పాటు ఇటు నాగ్ ఫ్యాన్స్ పండగ అని చెప్పుకోవాలి. మరోవైపు నాగార్జున్ ఇంతకుముందు ఓ బాలీవుడ్ చిత్రంలో విలన్ కనిపించి అలరించాడు. దీంతో మరోసారి విలన్‌గా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read..