Siddhu Jonnalagadda | టిల్లు 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda). పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. తెలుసు కదా (Telusu Kada) టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా (Raashi Khanna) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. టిల్లు ప్రాంఛైజీలో టిల్లు 3 కూడా రాబోతుండగా.. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే దశలో ఉంది టిల్లు టీం.
సిద్దు జొన్నల గడ్డ మళ్లీ ఎప్పుడు షూటింగ్లో జాయిన్ అవుతాడోనంటూ తెగ చర్చించుకుంటున్న మూవీ లవర్స్ కోసం చాలా రోజుల తర్వాత తెలుసు కదా షూటింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 5న హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. ఈ షెడ్యూల్‌కు సంబంధించి సిద్దూ టీం త్వరలోనే వివరాలు వెల్లడించనుందని టాక్.
ఈ చిత్రాన్ని పాపులర్ లీడింగ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ మూవీలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. PMF30గా వస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తు్ండగా.. యువరాజ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. స్టైలిష్ట్‌గా పాపులర్ అయిన నీరజ కోన ఈ సినిమాతో ఫిల్మ్ మేకర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
Pushpa 2 The Rule | ట్రిప్‌లో అల్లు అర్జున్-సుకుమార్.. మరి పుష్ప ది రూల్ షూటింగ్ ఎప్పుడంటే..?
Sardar 2 | కార్తీ సర్దార్ 2 షూట్లో స్టంట్‌మ్యాన్ మృతి.. కారణమిదే..!
SIIMA 2024 | సైమా 2024లో దసరా, జైలర్ హవా.. ఎన్ని కేటగిరీల్లో నామినేట్ అయ్యాయంటే..?