సోషల్ మీడియా పుణ్యమా అని అభిమానులతో ఈజీగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నారు నేటి కథానాయికలు. ఈ విషయంలో ఎక్కువగా ఉత్సాహం చూపే కథానాయిక శృతిహాసన్. ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టా ద్వారా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహిస్తుంటారామె. ఇటీవల నిర్వహించిన చిట్‌చాట్‌లో ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలిచ్చేసింది శృతిహాసన్.
ప్రేమ అనే పదానికి అర్థం చెబుతూ ‘అదొక అద్భుతమైన భావన. ప్రతి మనిషినీ విజయం వైపు నడిపించేది ప్రేమే. ఈ సందర్భంగా సమాజానికి నేను చెప్పేది ఒక్కటే. అందరూ తాము చేసే పనిని ప్రేమించండి.’ అని చెప్పుకొచ్చింది శ్రుతి. ఇంతలో ఓ నెటిజన్ ‘పెళ్లెప్పుడు చేసుకుంటారు?’ అనడగ్గా.. శ్రుతి కాస్తంగా అసహనం వ్యక్తం చేస్తూ.. ‘నేను చేసుకోనుసార్..’ అని ఫన్నీ రిైప్లె ఇచ్చేసింది.
మీ భాగస్వామికి ఉండాల్సిన అర్హతలు? అని మరో నెటిజన్ అడగ్గా.. ‘ఇది 2014.. దయచేసి ఇలాంటి చెత్త ప్రశ్నలు అమ్మాయిల్ని అడగడం ఆపేయండి. వారికి ఎలా సంతోషం అనిపిస్తే అలా బతకనివ్వండి. ఇలాంటి ప్రశ్నలు వినడానికి సిల్లీగా ఉంటాయి’ అంటూ ఇరిటేట్ అయ్యింది శృతిహాసన్. ‘మీరు ప్రస్తుతం సింగిలా?’ అనడిగితే.. ‘ఇలాంటి ప్రశ్నలు నాకు నచ్చవ్’ అంటూనే ‘రిలేషన్ కోసం ఎదురుచూస్తున్నాను’ అని సమాధానమిచ్చింది శృతిహాసన్. ఢిల్లీకి చెందిన ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఆమె నాలుగేళ్లు రిలేషన్లో ఉండి, ఇటీవలే బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.