వరలక్ష్మీ శరత్‌కుమార్, సాయికుమార్, అతిరారాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కూర్మనాయకి’. హర్షవర్ధన్ కడియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.విజితారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివాజీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. శనివారం ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మహావిష్ణువు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, అత్యున్నత సాంకేతి విలువలతో అలరిస్తుందని, ఈ సినిమాలో శివాజీ పాత్ర కథాగనమంలో కీలకంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నటించబోయే ఓ స్టార్ హీరో వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: శేఖర్‌చంద్ర, రచన-దర్శకత్వం: హర్షవర్ధన్ కడియాల.