Samantha | వరుణ్‌ధావన్‌తో సమంత నటించిన ‘సిటాడెల్’ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే స్ట్రీమింగ్కి రానుంది. మరోవైపు తన సొంత సినిమా ‘మా ఇంటి బంగారం’ కూడా సామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే బాలీవుడ్ నుంచి సమంతకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. షారుక్‌ఖాన్ సరసన సామ్ నటించనున్నదట.
దేశభక్తితో కూడిన యాక్షన్ అడ్వంచరస్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించనున్నట్టు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే ఈ సినిమా ప్రకటన రానున్నదట. షారుక్, రాజ్‌కుమార్ హీరానీ కాంబినేషన్లో రీసెంట్గా వచ్చిన ‘డంకీ’ సినిమా వాణిజ్యపరంగా పెద్దగా మెప్పించకపోయినా, విమర్శకుల ప్రశంసలందుకుంది. మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా అంటూ.. అందులో సమంత కథానాయిక అంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..