Ma Oori Polimera 2 | సత్యం రాజేశ్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ప్రాంఛైజీ ప్రాజెక్ట్ మా ఊరి పొలిమేర. ఓటీటీలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీకి సీక్వెల్ మా ఊరి పొలిమేర 2 (Ma Oori Polimera 2) కూడా వచ్చిన విషయం తెలిసిందే.గతేడాది నవంబర్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. పల్లెటూరి నేపథ్యంలో చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చుట్టూ తిరిగే డబుల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రానికి సంబంధించిన చాలా రోజుల తర్వాత మరో క్రేజీ వార్త బయటకు వచ్చింది.
ఈ మూవీ ఇటీవలే స్టార్ మాలో ప్రీమియర్ అయింది. తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రం మంచి స్పందన రాబట్టుకోవడమే కాదు.. 6.21 టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. తాజా అపేడేట్ మూడో పార్టు పై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. హార్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీకి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. బన్నీ వాస్ సౌజన్యంతో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు.
ఇప్పటికే మా ఊరి పొలిమేర 2ప్రతిష్టాత్మక 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ -2024కు ఎంపికైన విషయం తెలిసిందే. మా ఊరి పొలిమేర 2 విడుదలైన తొలి రోజు నుంచి తన హవా ఏంటో చూపిస్తుంది. ఈ చిత్రం ఆహాలో ప్రీమియర్ అయిన తర్వాత కేవలం 5 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ (నిమిషాలు)తో అరుదైన రికార్డు నమోదు చేసింది.
ఈ చిత్రంలో గెటప్ శీను, రాకేందు మౌళి, సాహిత్య దాసరి, రవివర్మ కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్‌కు ముందే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియాలోనే ఎక్కువగా వీక్షించిన రెండో ట్రైలర్‌గా మా ఊరి పొలిమేర 2 అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకుంది.
Kanguva | నైజాంలో సూర్య కంగువను విడుదల చేస్తుందెవరో తెలుసా..?
Disha Patani | దిశా పటానీ టాటూ మిస్టరీ వీడింది.. ఇంతకీ ఏంటో తెలుసా..?