Chaithra J Achar | రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ భామ ఛైత్ర జే అచర్ (Chaithra J. Achar). సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సెగలు రేపుతున్నాయి. స్విమ్ షూట్లో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఈ భామ నీటిలో తడిసిముద్దయింది.
కాటుక కండ్లతో మత్తెక్కించే హావభావాలతో హొయలుపోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. త్వరలోనే స్విమ్మింగ్ నేర్చుకుంటా. కానీ అప్పటివరకు ఇలా మెస్మరైజింగ్ పోజులతో మేనేజ్ చేస్తానంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఈ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
స్విమ్మింగ్ పూల్‌లో ఇలా..