Mr.Bachchan | రవితేజ కథానాయకుడిగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచార పర్వంలో జోరు పెంచారు. శుక్రవారం మూడోగీతం ‘జిక్కి..’ విడుదలైంది. మెలోడీ ప్రధానంగా స్వరకర్త మిక్కీ జే మేయర్ ఈ పాటను తీర్చిదిద్దారు.
అటు కాశ్మీర్ అందాలూ, ఇటు నాయకానాయికల కెమిస్ట్రీ రెండూ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే.. గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే.. పట్టుబట్టి పూల చేయి పట్టుకున్నదే.. అగ్గిరాజేశాక ఆగేదెట్లాగే..’ అంటూ చక్కటి ప్రణయభావాలతో ఈ పాట సాగింది.
వనమాలి రాసిన ఈ పాటను కార్తీక్, రమ్య బెహరా ఆలపించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. భాగ్యశ్రీబోర్సే, జగపతిబాబు, సచిన్‌ఖేడేకర్, సత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: హరీశ్‌శంకర్.