Rush | నటుడిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు (Ravi babu). విలక్షణమైన పాత్రలతో ఎంటర్టైన్ చేస్తూనే అవును, అనసూయ, అమరావతి, అవును 2 లాంటి హార్రర్ థ్రిల్లర్ సినిమాలతో డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా ప్రేక్షకులను భయపెట్టించడంతోపాటు థ్రిల్ అందించాడు రవిబాబు. ఈ క్రేజీ యాక్టర్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ.. నిర్మించిన చిత్రం రష్ (Rush). సతీశ్ పోలోజు దర్శకత్వం వహించాడు.
కన్నడ భామ డైసీ బోపన్న (Daisy Bopanna) లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ లో జోనర్ యూనిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అద్భుతమైన స్పందన వస్తోంది. సాధారణ గృహిణికి కొన్ని అసాధారణ పరిస్థితులు ఎదురైతే ఆమె వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కొందనే ఆసక్తికర పాయింట్‌తో స్టన్నింగ్ యాక్షన్ పార్టుతో సాగుతూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది రష్.
కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారనేది మరోసారి ప్రూవ్ చేస్తోంది రష్. ఈ మధ్యకాలంలో వచ్చిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల జాబితాలో రష్ చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. ఇంకేంటి మరి ఇక మీరూ ఓ సారి చూసేయండి.