Rashmika Mandanna | బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో టాప్ ఉంటుంది రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ భామ ఖాతాలో భారీ ప్రాజెక్టులే ఉండటం విశేషం. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి కుబేర చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తున్న పుష్ప ది రూల్‌లో శ్రీవల్లిగా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. వీటితోపాటు బాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్లో నటిస్తోన్న సికిందర్లో హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా చిత్రీకరణలో భాగంగా ముంబైలో ల్యాండ్ అయింది రష్మిక. ఇంతకీ ఈ బ్యూటీ ఏ సినిమా కోసం ముంబైకి వెళ్లిందనే కదా మీ డౌటు. సికిందర్ షూట్ కోసం ముంబైకి వెళ్లింది. తొలి రోజు షూట్ లొకేషన్లో దిగిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తొలి షెడ్యూల్లో భాగంగా మెహబూబ్ స్టూడియోస్‌లో సల్మాన్ ఖాన్ అండ్ టీంపై ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్టు సాజిద్ నడియాడ్వాలా ఇప్పటికే వెల్లడించాడు. తాజాగా నేషనల్ క్రష్ కూడా షూట్లో చేరిపోవడంతో ఎక్జయిట్కు లోనవుతున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
సికిందర్‌ను 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీలో విలన్‌గా సత్యరాజ్ కనిపించబోతున్నాడు. సముద్ర మట్టానికి 33 వేల అడుగుల ఎత్తులో ఎయిర్‌క్రాఫ్ట్‌లో సల్మాన్ ఖాన్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. ఈ చిత్రాన్ని 200 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
Sudheer Babu | సుధీర్ బాబు పాన్ ఇండియా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్
Double iSmart | ఊరమాస్‌గా రామ్ డబుల్ ఇస్మార్ట్ STEPPAMAAR లిరికల్ వీడియో సాంగ్
Thalapathy 69 | విజయ్ దళపతి 69 హీరోయిన్ ఫైనల్.. డైరెక్టర్‌పై క్లారిటీ..!
Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మూవీ!