Rashmika Mandanna | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్న సినిమాల్లో ఒకటి కుబేర (Kubera). టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అనే క్యాప్షన్‌తో చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న ధనుష్ లుక్‌ను మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
తాజాగా రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ గ్లింప్స్ చేశారు. నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిన రష్మిక గుంతలో పూడ్చిపెట్టిన ట్రాలీ బ్యాగ్‌ను బయటకు తీయగా.. డబ్బుతో నిండి ఉంది. ఇంతకీ రష్మిక ఆ బ్యాగ్‌ను ఎక్కడికి తీసుకెళ్లిందనేది సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేర ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇటీవలే ధనుష్, నాగార్జున, రష్మిక టీం ముంబై షెడ్యూల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. జుహూ బీచ్‌లో ధనుష్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించగా.. ఈ విజువల్స్ ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో కూడా ధనుష్, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.
కుబేర ఫస్ట్ లుక్ గ్లింప్స్..