Klin Kaara | టాలీవుడ్ క్యూట్ కపుల్స్ రామ్ చరణ్ (Ram Charan) – ఉపాసన (Upasana) దంపతుల ముద్దుల తనయ క్లింకార (Klin Kaara) మొదటి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మెగా కుటుంబంలో మరోసారి పండగ వాతావరణం నెలకొంది. మెగా ప్రిన్సెస్ ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఆ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. ఇదే సమయంలో క్లింకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
తన ముద్దుల కూతురి ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా ఉపాసన ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. ‘నా ప్రియమైన క్లింకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ రాక మా జీవితాల్లో మరింత సంతోషాన్ని తీసుకొచ్చింది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక వీడియోలో చరణ్, ఉపాసన ఇద్దరూ ప్రెగ్నెన్సీ నుంచి బేబీ పుట్టేంతవరకూ వారి ఫీలింగ్స్‌ను అందులో వివరించారు. అలాగే ఉపాసన ఫ్యామిలీ.. చరణ్ ఫ్యామిలీ మెంబర్స్ క్లింకారా గురించి చెప్పుకొచ్చారు.
‘ప్రతి ఒక్కరూ మా పిల్లల గురించి అడిగేవారు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత పాప జన్మించడం సంతోషంగా ఉంది. తనను ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు మర్చిపోలేని అనుభూతి’ అంటూ పాపతో తన జర్నీ గురించి చెబుతూ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఇక వీడియోలో వారి పెళ్లి సహా ప్రెగ్నెన్సీ నుంచి పాప పుట్టిన తర్వాత బారసాల వరకూ మధురమైన క్షణాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Also Read..
Dwaraka Tirumala Rao | ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు..
Malaysia Airlines | ఇంజిన్‌లో మంటలు.. శంషాబాద్‌లో కౌలాలంపూర్ విమానానికి తప్పిన ప్రమాదం
AC Price | ఓపక్క ఠారెత్తిస్తున్న ఉష్ణోగ్రతలు.. మరోపక్క ఏసీల ధరలకు రెక్కలు