Priyanka Chopra | మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు బుధవారం వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఒక హాలీవుడ్ మూవీ షూటింగ్లో భాగంగా ప్రియాంక స్టంట్స్ చేస్తుండగా స్వల్ప గాయలు అయినట్లు నిన్న ఇన్‌స్టా వేదికగా తెలిపింది. అయితే ఇదే షూటింగ్‌పై తాజాగా మరోక వీడియో విడుదల చేసింది ప్రియాంక. అవును.. మీరు యాక్షన్ సినిమాలు చేసినప్పుడు.. అది నిజంగా గ్లామరస్‌గా ఉంటుంది. మరొక రోజు షూటింగ్లో అంటూ కొత్త వీడియోను పంచుకుంది.
బాలీవుడ్‌కు చాలారోజులుగా దూరంగా ఉంటున్న ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తుంది. అయితే ప్రియాంక నటిస్తున్న తాజా హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’. బాయ్స్ ఫేమ్ ‘కార్ల్ అర్బన్’ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఫ్రాంక్ E. ఫ్లవర్స్’ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌లోనే తాను రిస్కీ స్టంట్స్ చేస్తున్నట్లు తెలిపింది. రస్సో బ్రదర్స్ బ్యానర్ ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ ఎమ్జీఎమ్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
#PriyankaChopra shares about the hurdles of doing an action movie. 💯#Celebs pic.twitter.com/Kko6nekC6s
— Filmfare (@filmfare) June 20, 2024