Priyanka Chopra | మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు షూటింగ్లో ప్రమాదం జరిగింది. హాలీవుడ్ మూవీ బ్లఫ్ షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరుగగా.. ప్రియాంకకు స్వల్ప గాయలు అయినట్లు సమాచారం.
బాలీవుడ్‌కు చాలారోజులుగా దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేస్తుంది. అయితే ప్రియాంక నటిస్తున్న తాజా హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’. బాయ్స్ ఫేమ్ ‘కార్ల్ అర్బన్’ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఫ్రాంక్ E. ఫ్లవర్స్’ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రమాదం జరుగగా.. ప్రియాంక గొంతు మీద చిన్న స్క్రాచ్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియాలో తెలిపింది. స్టంట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రాసుకోచ్చింది. రస్సో బ్రదర్స్ బ్యానర్ ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ ఎమ్జీఎమ్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.