Guruvayoor Ambalanadayil | మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ హీరో లీడ్ రోల్లో నటించిన మూవీ The Goat Life మార్చి 28న సర్వైవల్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చి.. బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు సలార్లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించి మూవీ లవర్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు పృథ్విరాజ్ సుకుమారన్ .
తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ స్టార్ కొత్త సినిమా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. విపిన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న రొమాంటిక్ కామెడీ డ్రామా ప్రాజెక్ట్ Guruvayoor Ambalanadayil. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది. బసిల్ జోసెఫ్, నిఖిల విమల్, అనస్వర రాజన్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, E4 Entertainment సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మే 16న గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. ఈ మూవీకి అంకిత్ మీనన్ సంగీతం అందిస్తున్నాడు.
I am hyped for Anand and Parvathy’s track by just these pics itself.. #GuruvayoorAmbalaNadayil #PrithvirajSukumaran the second one is my fav.. pic.twitter.com/54AapYenl6
— Am¹³ 🪷 (PJM2) (GAN May 16) (@BrightBirdRB) May 13, 2024