Deepika Padukone |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈవెంట్లో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్, దీపికాపదుకొణె (Deepika Padukone), రానా దగ్గుబాటి ఇతర నటీనటులు సందడి చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది.
ఈవెంట్‌కు హాజరైన బాలీవుడ్ స్టార్ నటి దీపిక పదుకొణె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఆమె తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. బేబీ బంప్‌తోనే ఈవెంట్‌కు హాజరైన దీపిక స్టేజ్‌పైకి వెళ్లేటప్పుడు, దిగేటప్పుడు కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో బిగ్‌బీ, ప్రభాస్ దీపికకు సాయం చేశారు. ముందుగా ఈవెంట్‌కు వచ్చిన వారిని స్టేజ్‌పైకి రానా ఆహ్వానించారు. అమితాబ్, ప్రభాస్ వెళ్లగా.. దీపికను కూడా స్టేజ్‌పైకి రమ్మన్నారు. ఆ సమయంలో దీపిక స్టేజ్ మెట్లు ఎక్కేటప్పుడు అమితాబ్ ఆమె చేయి పట్టుకుని సాయం చేశారు. అనంతరం మాట్లాడటం అయిపోయాక స్టేజ్ దిగేటప్పుడు ప్రభాస్.. దీపికకు సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
The Boys🤣 pic.twitter.com/R5ad2Tk5pu
— 𝘍𝘪𝘭𝘮 𝘚𝘵𝘢𝘯 𝘩𝘺𝘱𝘦𝘥 𝘧𝘰𝘳 𝘒𝘢𝘭𝘬𝘪 (@filmstanhere) June 19, 2024
Also Read..
Kamal Haasan | ఎప్పుడూ బ్యాడ్‌మ్యాన్ పాత్ర చేయాలనుకుంటా.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్
Nag Ashwin | కల్కి 2898 ఏడీ మూడో ప్రపంచం షంబాలా.. నాగ్ అశ్విన్ ఎపిసోడ్ 2 వీడియో వైరల్
Klin Kaara | క్లింకార ఫస్ట్ బర్త్‌డే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఉపాసన