Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తు్న్నాడు. వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు మేకర్స్.
ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం కల్కి 2898 ఏడీ ట్రైలర్ లాంఛ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ (Bhairava) పాత్రలో నటిస్తుండగా.. అతడి దోస్త్ బుజ్జి (Bujji)గా స్పెషల్ కారు సందడి చేయనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ టైటిల్, గ్లింప్స్ వీడియో, టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.