Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభాస్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా మూవీ లవర్స్‌ను షాకింగ్ న్యూస్ ఒకటి ఆందోళనకు గురిచేస్తుంది.
ఇంతకీ విషయమేంటంటే.. కల్కి 2898 ఏడీ హిందీ వెర్షన్‌కు సంబంధించి 15 ఐమ్యాక్స్ షోలు ఊహించని విధంగా రద్దయ్యాయి. అయితే ఈ సమస్య ఏర్పడింది కెనడాలో కావడంతో ఇక్కడి అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కెనడాలో మినహా మిగిలిన అన్ని అంతర్జాతీయ కేంద్రాల్లో ఐమ్యాక్స్ స్క్రీనింగ్స్ యదావిధిగా కొనసాగనున్నాయి. సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తోన్న ఈ మూవీ ఐమ్యాక్స్, 4dx, 3D ఫార్మాట్లలో కూడా సందడి చేయనుంది.
వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా… బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటిస్తున్నాడు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ మిడ్ వీక్‌లో విడుదలవుతున్నప్పటికీ బుకింగ్స్ షురూ చేసిన కొన్ని గంటలకే నేషనల్ బెల్ట్‌లో హిందీ వెర్షన్ టిక్కెట్స్ సుమారు 13 వేలకుపైగా అమ్ముడయ్యాయని ఇప్పటికే స్టన్నింగ్ వార్త బయటకు వచ్చింది. ఇక కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ సేల్స్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.50 కోట్లు దాటి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది.