Toxic | కేజీఎఫ్ ప్రాంఛైజీ తర్వాత అభిమానుల ఎక్జయిట్మెంట్కు తెరదించుతూ టాక్సిక్ (Toxic) సినిమాను ప్రకటించాడు. కన్నడ స్టా్ర్ హీరో యశ్ (Yash). పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ A Fairy Tale For Grown Ups ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. యశ్ 19వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
కాగా చాలా రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో పాపులర్ బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి కీలక పాత్రలో నటించనుందన్న వార్త ఒకటి బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం బ్రదర్-సిస్టర్ నేపథ్యం సినిమాకు హైలెట్‌గా నిలువబోతుందట. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతేకాదు మేకర్స్ ఇటీవలే కీ షెడ్యూల్ కోసం కర్ణాటకలో భారీ సెట్స్ వేశారట.
ఇప్పటివరకు వచ్చిన కథనాల ప్రకారం 1970స్ గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా సాగనుండగా.. బెంగళూరులో అగ్రభాగం, కొంతభాగం శ్రీలంకలో టాక్సిక్ షూటింగ్ కొనసాగించనున్నారట మేకర్స్. కేజీఎఫ్ ప్రాంఛైజీ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్టు తర్వాత యశ్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
టాక్సిక్ గ్లింప్స్ వీడియో..
Raayan | కౌంట్ డౌన్ షురూ.. రాయన్ ప్రమోషన్స్‌లో ధనుష్ టీం