OG | టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారని తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఓ వైపు అధికారులతో వరుస సమీక్షలు చేస్తూనే.. మరోవైపు జనాలతో మమేకమవుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు పెరుగడంతో పవన్ కల్యాణ్ ఇంతకీ సినిమా షూటింగ్స్ కు హాజరవుతారా..? లేదా..? అంటూ డైలామాలో పడిపోయారు అభిమానులు. ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు క్లారిటీ ఇచ్చారు పవన్ కల్యాణ్.
పిఠాపురం వారాహి సభలో పవన్ కల్యాణ్ ఆసక్తిక కామెంట్స్ చేసి సినిమాలకు సంబంధించి ప్లాన్ ఎలా ఉండబోతుందో చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుంటే మధ్యలో అందరూ ఓజీ.. ఓజీ అంటూ అరవడం మొదలుపెట్టారు. అయితే జనాలు ఏమంటున్నారో అర్థం కాకపోవడంతో పక్కనే ఉన్న వారిని అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్.. తనదైన స్టైల్లో ఫన్నీగా ఓజీ సినిమానా..? అని అడిగాడు.
ఆ వెంటనే జనాలంతా కేరింతలు కొట్టారు. ప్రస్తుతం సినిమాలు తీసే సమయం ఉందా..? మీకు మాటిచ్చాను కాబట్టి మూడు నెలలు సినిమా షూటింగ్స్ పెట్టుకోను. ఆంధ్రాలో రోడ్డు వేసిన తర్వాత.. గుంతలు పూడ్చిన తర్వాత షూటింగ్స్‌కు వెళ్తానని చెప్పారు పవన్ కల్యాణ్. కుదిరినప్పుడల్లా 2,3 రోజులు షూటింగ్‌కు వెళ్తా. నిర్మాతలకు కూడా క్షమాపణలు చెప్పానన్నారు. ఈ లెక్కన పవన్ కల్యాణ్ షూటింగ్లో జాయిన్ కావాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందేనన్నమాట.
Dy CM @PawanKalyan garu speaks about #TheyCallHimOG & movie shootings. pic.twitter.com/LeyOmKWrkb
— Trend PSPK (@TrendPSPK) July 3, 2024
Coolie | పాపులర్ టెక్నీషియన్‌తో లోకేశ్ కనగరాజ్.. రజినీకాంత్ కూలీ తాజా వార్త ఇదే
Atlee | అంతకు ముందే గెస్ట్ రోల్.. కీర్తిసురేశ్-అట్లీ సినిమాలో సల్మాన్ ఖాన్..!
Kamal Haasan | కమల్ హాసన్ ఇండియన్ 2కు సూపర్ క్రేజ్.. ఐమాక్స్ వెర్షన్ రెడీ
Raayan | బిగ్ స్క్రీన్లను బద్దలు కొట్టేందుకు రెడీ.. ధనుష్ రాయన్ ఈవెంట్ వివరాలివే