నిర్మాణ రంగంలో పేరొందిన అపర్ణ కన్స్‌స్ట్రక్షన్స్ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులకు ఉత్తమ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ప్రపంచ స్థాయి సదుపాయాలతో హైదరాబాద్ శివారులోని నల్లగండ్లలో నిర్మించిన ‘అపర్ణ సినిమాస్ మల్టీఫ్లెక్స్’ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అపర్ణ సినిమాస్ లోగోని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అపర్ణ కన్స్‌స్ట్రక్షన్స్ ఆపరేషన్స్ హెడ్ రామకృష్ణ మాట్లాడుతూ ‘అపర్ణ సంస్థ ఏది చేసినా ది బెస్ట్‌గానే ఉంటుంది. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌గారి సలహాతో సినీరంగంలోకి రావడం జరిగింది. ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యాధునిక సాంకేతికత, సదుపాయాలతో ఈ మల్టీఫ్లెక్స్ను నిర్మించాం’ అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ ‘అపర్ణ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఉత్తమ సౌండ్ సిస్టమ్, విశాలమైన పార్కింగ్ ఏరియాతో ఈ మల్టీఫ్లెక్స్ను నిర్మించారు. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతినిస్తుంది’ అన్నారు. ఈ మల్టీఫ్లెక్స్‌లో ఏడు స్క్రీన్స్ ఉన్నాయని, 1208 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉందని, అందరికి అందుబాటు ధరలో ఫుడ్‌కోర్ట్‌ను ఏర్పాటు చేశామని అపర్ణ సినిమాస్ మేనేజర్ మధుకర్ తెలిపారు.