Nivetha Thomas | మలయాళ బ్యూటీ నివేదా థామస్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘కొంతకాలం గడిచింది.. కానీ.. చివరిగా!’ అంటూ నర్మగర్భంగా పోస్ట్‌లో అక్షరాలను పొందుపరిచింది నివేద. ఇక ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు నివేతా పెళ్లి చేసుకోబోతుంది అంటూ కామెంట్లు పెట్టగా.. మరికొందరు మూవీ అప్డేట్ అయ్యింటుందని కామెంట్లు పెట్టారు. అయితే అందరు అనుకున్నట్లుగానే ఈ పోస్ట్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పెట్టినట్లు క్లారిటీ ఇచ్చింది.
నివేదా థామస్, యువ నటుడు విశ్వదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 35- చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu). ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ నందకిశోర్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తుండగా.. సృజన్ యరబోలు సిద్దార్థ్ రాళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్రబృందం తాజాగా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రానా దగ్గుబాటి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ చూస్తే.. నివేదా థామస్ ఇందులో మిడిల్ క్లాస్ మహిళగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
Here’s the first look of “35 Chinna Katha Kadhu”#35CKK ~ ఇంక మూలాజే లేదు🔥#35Movie In cinemas from AUGUST 15th, 2024@i_nivethathomas @PriyadarshiPN @imvishwadev @gautamitads #NandaKishore #VivekSagar @nikethbommi @siddharthr87 @srujanyarabolu1 @SOriginals1 @WALTAIRPRO… pic.twitter.com/tPaPZnQ0Q4
— Rana Daggubati (@RanaDaggubati) July 3, 2024
ఇవి కూడా చదవండి..