వరుణ్‌సందేశ్, మధులిక వారణాసి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకుడు. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కథాంశమిది. వరుణ్‌సందేశ్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో ఆకట్టుకుంటారు’ అన్నారు.
తన కెరీర్లో ఇదొక వైవిధ్యమైన చిత్రమని వరుణ్‌సందేశ్ తెలిపారు. త్వరలో పాటలు, మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తామని నిర్మాత పేర్కొన్నారు. దువ్వాసి మోహన్, సూర్య రవివర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హజరత్ షేక్ (వలి), సంగీతం: సుభాష్ ఆనంద్, సహనిర్మాత: బి. నికిత జగదీష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్యన్స సుభాన్ ఎస్కే.