Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv) డైరెక్ట్ చేస్తున్నాడు. నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే హాయ్ నాన్న నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ఈ మూవీ నుంచి సమయమా సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో లాంఛ్ చేసిన ఈ పాటలో హీరోహీరోయిన్లు ప్రకృతిని ఆస్వాదిస్తూ.. చిల్ అవుట్ అవుతున్నారు. మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ అందించబోతున్న హాయ్ నాన్న మ్యూజికల్ ట్రీట్ అద్భుతంగా ఉండబోతుందని ఫస్ట్ సింగిల్ ట్యూన్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు. కాగా మేకర్స్ కూల్ లుక్ ఒకటి విడుదల చేశారు.
నాని తన కూతురుతో కలిసి ఓ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న లుక్ షేర్ చేశారు మేకర్స్. హాయ్ అక్టోబర్.. చల్లటిగాలి కోసం రెడీగా ఉండండి.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడీ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఈ నెలలో మరో పాట ఏమైనా విడుదల చేస్తున్నారా.. అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఇటీవలే నాని టీం తమిళనాడులోని కూనూర్, ఊటీలో హాయ్ నాన్న కొత్త షెడ్యూల్ పూర్తి చేసింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న హాయ్ నాన్నలో మృణాళ్ ఠాకూర్ యశ్న పాత్రలో నటిస్తోండగా.. బేబి కైరా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది.
హర్ట్ టచింగ్ ట్యూన్‌తో సాగే టైటిల్ గ్లింప్స్ వీడియో హాయ్ నాన్న మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల తర్వాత కెమెరామెన్ సను జాన్ వర్గీస్ ఐఎస్సీ మరోసారి నానితో చేస్తున్న మూడో సినిమా ఇది.
హాయ్ అక్టోబర్..
Hi October ✨❄️
Get Ready for some cool breeze 🤗#HiNannaNatural🌟 @NameIsNani #MrunalThakur @shouryuv @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri @VyraEnts@TSeries @TseriesSouth pic.twitter.com/9hE8zlvZp3
— Vyra Entertainments (@VyraEnts) October 1, 2023
సమయమా సాంగ్
సమయమా సాంగ్ ప్రోమో..
Tomorrow 🙂#Samayama #SaayaTera #Nizhaliyae #Vivarane #Hridayame#HiNanna pic.twitter.com/zYpkVQ1Kp9
— Nani (@NameisNani) September 15, 2023
𝐇𝐢 👋
The time has come to TURN UP the MUSICAL HEAT 🔥#HiNanna Musical Gala begins❤️🔥Are you ready? 😉
Natural🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri @VyraEnts@TSeries @TseriesSouth pic.twitter.com/NGuLnFLSEB
— Vyra Entertainments (@VyraEnts) September 13, 2023
Nani’s #HiNanna new schedule begins in Ooty.
Nani, Mrunal Thakur, Shruthi Haasan. pic.twitter.com/zJHmNc6q6x
— Christopher Kanagaraj (@Chrissuccess) September 2, 2023
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..