NagaChaitanya | ‘వృషకర్మ’ ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్.. పెద్దపల్లి రామగిరి ఖిల్లాపై నాగచైతన్య సాహసయాత్ర
Naga Chaitanya | సాధారణంగా సినిమాల ప్రచారం అనగానే స్టూడియోలలో కూర్చుని ఇచ్చే ఇంటర్వ్యూలు లేదా ప్రెస్ మీట్లు మాత్రమే గుర్తుకువస్తాయి.
Naga Chaitanya | సాధారణంగా సినిమాల ప్రచారం అనగానే స్టూడియోలలో కూర్చుని ఇచ్చే ఇంటర్వ్యూలు లేదా ప్రెస్ మీట్లు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ ఆ సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలుకుతూ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన తదుపరి చిత్రం ‘వృషకర్మ’ ప్రమోషన్లతో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఏసీ గదులను వదిలి ప్రకృతి ఒడిలోకి అడుగుపెడుతూ, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న చారిత్రక రామగిరి ఖిల్లాపై సాహసోపేతమైన ట్రెక్కింగ్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ ‘జస్టి’తో కలిసి ఆయన ఈ పురాతన కోటను అధిరోహించి, అక్కడి చారిత్రక వైభవాన్ని, ప్రకృతి అందాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను చిత్రీకరించారు. దీనితో చారిత్రక రామగిరి ఖిల్లాపై ట్రెక్కింగ్ చేసిన మొట్టమొదటి సినీ సెలబ్రిటీగా నాగచైతన్య అరుదైన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు.
అద్భుతమైన రాతి కట్టడాలు, ఏడు భారీ ద్వారాలతో కొండపై కొలువైన రామగిరి ఖిల్లాకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడి పాదస్పర్శతో ఈ నేల పునీతమైందని స్థానికుల విశ్వాసం. చుట్టూ కనుచూపు మేర పరుచుకున్న పచ్చని ప్రకృతి సోయగాలతో పాటు, వేలాది అరుదైన ఔషధ మూలికలకు ఈ కొండ నిలయంగా విరాజిల్లుతోంది. నాటి రాజుల కాలంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన భారీ ఫిరంగులు, పురాతన ఆలయాలు నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ కోట మొదటి ద్వారం వద్ద నుంచి చూస్తే దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ మానేరు ప్రాంతం సైతం స్పష్టంగా కనిపించడం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఇంతటి అపురూపమైన వారసత్వ సంపదను స్వయంగా సందర్శించి, మన ప్రాంతపు చరిత్రకు తగిన గుర్తింపు రావాలనే ఉద్దేశంతో దీని విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతున్న యూట్యూబర్ జస్టి కృషిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
కార్తీక్ దండు దర్శకత్వంలో మిథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ సినిమా కథా నేపథ్యానికి తగ్గట్టుగానే ఈ ప్రమోషనల్ ట్రెక్కింగ్‌ను ప్లాన్ చేయడం విశేషం. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం వినూత్న ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకులలో అంచనాలను పెంచుతోంది. నాగచైతన్య, జస్టి కలిసి రామగిరి ఖిల్లాపై చేసిన ఈ సాహసయాత్ర మరియు కోట విశేషాలతో కూడిన పూర్తి వీడియో నవంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NagaChaitanya | ‘వృషకర్మ’ ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్.. పెద్దపల్లి రామగిరి ఖిల్లాపై నాగచైతన్య సాహసయాత్ర
Huzurabad | సగరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
Karan Johar | సోషల్ మీడియా అల్గారిథమ్ నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది: కరణ్ జోహార్
Phule Movie | సామాజిక విప్లవకారుల స్ఫూర్తిదాయక గాథ.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’!
Air Pollution | గాలి కాలుష్యం వల్ల కూడా గుండె జబ్బులు, మధుమేహం.. జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

