Nag Ashwin | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంపౌండ్ నుంచి వస్తున్ చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ జోనర్లో వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ నాగ్ అశ్విన్ టీం ఏదో ఒక ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన The Prelude of Kalki2898AD ఎపిసోడ్ 1లో ఈ కథ అన్నింటికీ క్లైమాక్స్. మన కలియుగంలో ఏం జరుగబోతుంది. ఎలా జరుగొచ్చు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ఈ కథతో అనుబంధం కలిగి ఉంటారంటూ నాగ్ అశ్విన్ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఎపిసోడ్ 2ను లాంఛ్ చేశారు మేకర్స్. భూమి మీద మొదటి నగరం.. ఇప్పుడు ఆకరి నగరం ఐడియాతో మొదలుపెట్టాం కల్కి. దేవుడిని నిషేధించిన నగరమిది. షంబాలాలో కూడా ఓ నమ్మకం ఉండేది. భవిష్యత్‌లో కలియుగం పూర్తయిన తర్వాత.. గంగ ఎండిపోయిన తర్వాత చివరి సిటీ ఏముంటుంది..,? మన కాశీ ఉంటుందనుకుంటే.. కల్కిలో మూడో ప్రపంచం షంబాలా ప్రత్యేకతలను తెలియజేస్తూ నాగ్ అశ్విన్ టీం షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ (Bhairava) పాత్రలో కనిపించనుండగా.. అతడి దోస్త్ బుజ్జి (Bujji) పాత్రలో స్పెషల్ కారు సందడి చేయనుంది. బుబ్జి పాత్రకు కీర్తిసురేశ్ వాయిస్ ఓవర్ అందించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
The future is now…
Presenting Episode 2 – The World of #Kalki2898AD ft. Director @nagashwin7.#Kalki2898ADonJune27 pic.twitter.com/Pwezvkl8D0
— Kalki 2898 AD (@Kalki2898AD) June 20, 2024