Nag Ashwin | టాలీవుడ్‌తో పాటు దేశమంతా ప్రస్తుతం కల్కి ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు.
ఇక ఈ సినిమా సూపర్ హిట్ అందుకున్న సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ పెట్టిన ప్రత్యేక పోస్ట్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాను ఈ సినిమా కోసం చెప్పులు అరిగిపోయేలా పని పనిచేశానని సింబాలిక్‌గా చెబుతూ.. తన అరిగిపోయిన చెప్పులు ఉన్న ఫోటోలను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు ఇది సుదీర్ఘ రహదారి అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Kalki2898AD director @nagashwin7 Instagram story pic.twitter.com/K3l2nbkqBx
— Suresh PRO (@SureshPRO_) June 27, 2024
ఇవి కూడా చదవండి..