Prabhas – Payal Rajput | ‘ఆర్.ఎక్స్ 100’ ‘మంగళవారం’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది పాయల్ రాజ్‌పుత్. ఇక మంగళవారం ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. అయితే తాజాగా ఈ భామ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఈ భామ ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని.. తనకోసం నా ఫేవరేట్ అయిన రాజ్మా చావల్ ను ప్రభాస్‌కు వండి పెడతానని వీడియోలో చెప్పుకోచ్చింది. దీనికి యాంకర్ అంటే ప్రభాస్‌కు తినిపిస్తారా అని అడుగగా.. నా చేతితో దగ్గరుండి తినిపిస్తా అంటూ తెలిపింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు ప్రభాస్ శుక్రవారం ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు. డార్లింగ్స్ త్వరలోనే మనలోకి ఓ కొత్త పర్సన్ రాబోతోన్నారు.. గుడ్ న్యూస్.వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఓ పోస్ట్ వేశాడు. అయితే ఈ పోస్ట్ వేసిన కాసేపటికే పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాలో నేను కచ్చితంగా ఎవరికో ఒకరికి డార్లింగ్ అవుతున్నా.. ఎనీ గెస్ అంటూ ఓ వీడియోని వదిలింది. దీంతో పాయల్, ప్రభాస్ మధ్యలో ఏదో ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
#PayalRajput about our Darling #Prabhas 😍 pic.twitter.com/TufEoz1TJS
— INDRA SENA REDDY 🌶️ (@Indra_Reddy_29) May 17, 2024
Rendu Oke laga unnai kadha 🤨
Any Movie Promotions..??#Prabhas #PayalRajput pic.twitter.com/4HXiDrSZlr
— SAI CHOWDARY (@im_saichowdary) May 17, 2024