Son of Sardar | బాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి తెలుగులో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ భామ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సిద్ధాంత్ చతుర్వేదితో ఒక మూవీ చేస్తున్న మృణాల్ మరో బంపర్ ఆఫర్ కొట్టినట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగణ్- సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్. రాజమౌళి తీసిన మర్యాద రామన్న సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం హిందీలో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇదే సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో అజయ్ దేవగన్ సరసన మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి మృణాల్‌ను సంప్రదించగా మృణాల్ ఒకే చెప్పినట్లు టాక్. ఈ మూవీ తొలి షెడ్యూల్ షూటింగ్‌ను స్కాట్లాండ్లో ప్లాన్ చేయనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..