Varun Tej | ప్రస్తుతం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సమాజంలోని అన్ని రంగాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నది. సినీ రంగంలో కూడా ఏఐ సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ సాంకేతికత ప్రధానంగా తెలుగులో ఓ లవ్‌స్టోరీ రానుందని వార్తలొస్తున్నాయి.
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. దాదాపు రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేసి దర్శకుడు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారని, కాన్సెప్ట్‌లో కొత్తదనం నచ్చడంతో వరుణ్‌తేజ్ ఈ సినిమాకు గ్రీన్ ఇచ్చారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం వరుణ్‌తేజ్ ‘మట్కా’ చిత్రంలో నటిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ ఫిల్మ్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది.