Meenakshi Chowdary | తమిళ హాస్య నటుడు సంతానం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రాజా రాణి, డీడీ రిటర్న్స్, నేనే అంబానీ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సంతానం హీరోగా నటించిన చిత్రాలలో ‘దిల్లుకు దుడ్డు’(డీడీ) అనే చిత్రానికి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ ఫ్రాచైంజ్లో మూడు సినిమాలు రాగా సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే ఇప్పుడు డీడీ రిటర్న్స్ కు మరోసారి సీక్వెల్ రాబోతుంది.
తాజాగా వస్తున్నఈ సీక్వెల్‌కు ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించబోతుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా హిట్ 2 ఫేమ్ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ గురించి మీనాక్షిని సంప్రదించగా మీనాక్షి ఒకే చెప్పినట్లే తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మీనాక్షి విజయ్ సరసన ‘ది గోట్’ చిత్రంలో నటిస్తున్నారు.