Mahesh Babu Birthday | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తన 50వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సెలబ్రిటీలు, నిర్మాతలు, దర్శకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు మై డియర్ మహేశ్ బాబు. తెలుగు సినిమాకి గర్వకారణంగా నిలిచిన మీరు అసాధారణ ప్రతిభ, ఆకర్షించే గుణంతో అభిమానుల హృదయాలు కొల్లగొడుతున్నారు. ఏండ్లు గడిచేకొద్ది మరింత యవ్వనంగా మారుతున్నారు. ఈ ఏడాది కూడా మీకు సంతోషం, విజయంతో పాటు ఆనందకరమైన క్షణాలతో కూడిన సంవత్సరం కావాలని ఆశిస్తున్నా అంటూ చిరు రాసుకోచ్చాడు.
Happy Happy 50th, my dear SSMB @urstrulyMahesh !💐🤗
You are the pride of Telugu Cinema, destined to conquer the beyond!
You seem to grow younger with every passing year!Wishing you a wonderful year ahead and many, many happy returns! 💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2025
హ్యాపీ బర్త్‌డే అన్నా. ఈ ఏడాది కూడా మీకు సంతోషం, విజయంతో పాటు ఆనందకరమైన క్షణాలతో కూడిన సంవత్సరం కావాలని ఆశిస్తున్నా అంటూ ఎన్టీఆర్ రాసుకోచ్చాడు.
Happy Birthday @urstrulymahesh Anna. Wishing you all the love and success…
— Jr NTR (@tarak9999) August 9, 2025
వెంకటేష్ కూడా మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ, “పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నోడా.. ఎల్లప్పుడూ ప్రేమ, నవ్వు మరియు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని ఒక ఫోటోను షేర్ చేశారు.
Happy birthday dearest @urstrulyMahesh! Today you turn 50 but you’ll forever be my Chinnodu 🤗❤️❤️
Your humor and kindness light up the hearts of so many… there’s truly no one like you. Keep smiling, special one. Can’t wait for the world to witness your magic in #SSMB29!✨ pic.twitter.com/r228b8qbnU
— Venkatesh Daggubati (@VenkyMama) August 9, 2025
సూపర్‌స్టార్ మహేశ్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని ఎవరితోనూ పోల్చలేం. మీ #SSMB29 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అది తప్పకుండా చరిత్ర సృష్టిస్తుందని నమ్ముతున్నాం అంటూ నారా రోహిత్ రాసుకోచ్చాడు.
హ్యాపీ బర్త్‌డే మహేశ్ అన్నా. మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా. #SSMB29 ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నా. అని కిరణ్ అబ్బవరం తెలిపాడు.