Mahavatar Narsimha | హిందూ మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో యానిమేటెడ్ చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన చిత్రం ‘మహావతార్ నరసింహ'(Mahavatar narsimha) కన్నడ టాప్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగులో మంచి కలెక్షన్లు సాధించడమే కాకుండా తాజాగా రూ. 175 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో యానిమేటేడ్ వెర్షన్లో వచ్చి ఇండియన్ సినిమాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా మూవీ రికార్డును నమోదు చేసింది.
హోంబలే ఫిల్మ్స్‌తో కలిసి క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జూలై 25న విడుదలైంది. హిందూ పురాణాల ఆధారంగా రూపొందించిన ఈ యానిమేటెడ్ చిత్రం విష్ణువు దశావతారాల గురించి ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో మొదటిది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించాడు.
175 CRORES+ worldwide gross & counting…💥💥
The divine saga of #MahavatarNarsimha is rewriting history at the box office.
The roar is unstoppable… experience it in theatres now 🦁#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG @shilpaadhawan… pic.twitter.com/N13LJBWD4E— Hombale Films (@hombalefilms) August 10, 2025