Fahadh Faasil | కోలీవుడ్ స్టార్ జంట నయనతార విగ్నేష్ శివన్, మలయాళ స్టార్ జంట ఫహద్ ఫాజిల్, నజ్రియా ఒకే చోట కలిసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోను నయనతార తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ.. ఫైనల్గా మీట్ అయ్యాం అంటూ రాసుకోచ్చింది. నయనతార, నజ్రియా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా కలుస్తుంటారు. అయితే ఈసారి ఏకంగా ఫ్యామిలీతో కలుసుకోవడంతో ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా అని నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
సినిమాల విషయానికి వస్తే.. గతేడాది జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నయన్.. ఈ చిత్రం అనంతరం అన్నపూరణి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా అనంతరం ఏ సినిమాకు ఒకే చెప్పలేదు. విగ్నేష్ శివన్ కూడా ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ విషయంలో బిజీగా ఉన్నాడు. ఇక అంటే సుందరానికి అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన నజ్రియా ఆ తర్వాత ఎటువంటి సినిమాలు ఒప్పుకోలేదు. మరోవైపు ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో అంటే ఫహద్ ఫాజిల్ అని చెప్పక తప్పదు. ఈ జనవరిలో ప్రేమలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఫహద్ తాజాగా ఆవేశంతో రూ.150 కోట్ల కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
Finallly💝 pic.twitter.com/BgOHHstu7V
— Nayanthara✨ (@NayantharaU) June 24, 2024