Kamal Haasan | రజనీకాంత్ హీరోగా శంకర్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘రోబో’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో పాటు సరికొత్త సాంకేతిక హంగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తొలుత ఈ చిత్రాన్ని కమల్‌హాసన్‌తో తీయాలని దర్శకుడు శంకర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అనంతరం రజనీకాంత్‌తో తెరకెక్కించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘భారతీయుడు-2’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కమల్‌హాసన్ ‘రోబో’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఆ సినిమాలో తాను నటించక పోవడానికి కారణాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ “ఐ-రోబో’ అనే ఇంగ్లీష్ నవలను సినిమాగా తీస్తే బాగుంటుందని రచయిత సుజాతతో పాటు నేను, దర్శకుడు శంకర్ 90దశకంలోనే ప్రయత్నాలు చేశాం. నా లుక్‌టెస్ట్ కూడా జరిగింది.
అయితే అప్పటి మార్కెట్ లెక్కల ప్రకారం అంతటి భారీ బడ్జెట్‌తో సినిమా తీయడం సేఫ్ కాదనిపించింది. దాంతో ఆ ప్రాజెక్ట్‌ను విరమించుకున్నాను. అయితే శంకర్ మాత్రం కొన్నేళ్లపాటు ఆ స్క్రిప్ట్‌పై వర్క్ చేసి సరైన టైమ్‌లో సినిమా తీసి విజయం సాధించారు’ అని తెలిపారు.