Kalki 2898 AD | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు రూ.95.3 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే తాజాగా ఈ సినిమా బుకింగ్స్ పరంగా రికార్డు క్రీయేట్ చేసింది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో లో శనివారం ఒక్కరోజే 24గంటల్లో 12.8లక్షల టికెట్స్ అమ్ముడయినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా మూడోరోజున ఇన్ని టికెట్లు అమ్ముడుపోలేదని ప్రకటించింది. ఇక ఆదివారం వీకెండ్ కావడం వల్ల రెస్పాన్స్ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది.
నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా… బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి..